సెలబ్రెటీలు ఏం మాట్లాడలన్నా ఆచి తూచి మాట్లాడాల్సిందే. ఒకప్పుడు అంటే సోషల్
మీడియా లేదు. కాబట్టి ఏం మాట్లాడినా వార్తల్లో చూసిన రోజు వరకే గుర్తుండేది. కానీ ఇప్పుడు అలా కాదు కొంచం నోరుజారినా..ఆలోచించించి మాట్లాడకపోయినా ట్రోల్స్ దాడికి బలవ్వాల్సిందే. తాజాగా అలాంటి పరిస్థితే
కమల్ హాసన్ కూతురు
శృతి హాసన్ కు వచ్చింది. ఎప్పుడో 2017 లో
శృతి హాసన్ చేసిన ట్వీట్ పై నెటిజన్లు ఇప్పుడు ట్రోల్స్ చేస్తున్నారు. ఇంతకీ
శృతి ఏం మాట్లాడింది..నెటిజన్లు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు. అన్నది ఇప్పుడు చూద్దాం...శృతి హాసన్ 2017లో ఇప్పట్లో తనకు ఇప్పుడప్పుడే ఫ్యూచర్ లో
కన్నడ సినిమాలలో నటించే ఉద్దేశ్యం లేదని..దయచేసి ఎవరూ తనను సంప్రదించివద్దని ట్వీట్ చేసిందట. దాంతో అప్పుడు
కన్నడ ప్రేక్షకులు కామ్ గానే ఉన్నారు. మనకు
శృతి పాప ను చూసే అదృష్టం లేదని అనుకున్నారు. కానీ ప్రస్తుతం
శృతి హాసన్ "సలార్" మూవీకి ఒకే చెప్పిన సంగతి తెలిసిందే. ఇక
శృతి సలార్ కు ఒకే చెప్పడంతోనే అసలు సమస్య వచ్చిపడింది. సలార్ దర్శకుడు
ప్రశాంత్ నీల్ బేసిక్ గా
కన్నడ దర్శకుడు. కాబట్టి ఇప్పుడు.కన్నడ దర్శకుడితో ఎలా
సినిమా తిస్తున్నావంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. మరోవైపు
శృతి హాసన్ "పొగరు" సినిమాకు సంబంధించి మాత్రమే
కన్నడ సినిమాలలో నటించను అని చెప్పినట్టు కూడా ఒక వాదన వినిపిస్తోంది. ఇక
శృతి ఏ ఉద్దేశ్యం తో ట్వీట్ చేసిందో..నెటిజన్లు ఏమని అర్థం చేసుకున్నారో కానీ మొత్తానికి ట్రోల్స్ కు బలవుతోంది. ఇక ఈ ట్రోలింగ్ పై ఇప్పటివరకు
శృతి హాసన్ స్పందించలేదు. ఒకవేళ స్పందిస్తే ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇదిలా ఉండగా
క్రాక్ విజయంతో
శృతి హాసన్ ఫుల్
జోష్ మీద ఉంది. మరోవైపు కొత్త బాయ్ ఫ్రెండ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ తరచూ వార్తల్లో నిలుస్తోంది.