దీంతో ఎంతో మంది సినీ కార్మికులు ఉపాధి కరువై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లాక్ డౌన్ రోజుల్లో సినిమా షూటింగ్ ప్రారంభం కాకపోవడంతో కనీస ఉపాధి లేక తినడానికి తిండి లేని పరిస్థితిని కూడా ఎదుర్కొన్నారు ఎంతో మంది సినీ కార్మికులు. అయితే తర్వాత అన్లాక్ మార్గదర్శకాలు లో భాగంగా సినిమా షూటింగ్ లు ప్రారంభించు కునేందుకు అవకాశం వచ్చిన నేపథ్యంలో ఎంతోమంది ఇప్పుడిప్పుడే సినిమా షూటింగులో ప్రారంభిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో కేవలం 50 శాతం సామర్థ్యంతో సినిమా హాళ్లు తెరుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
దీంతో ఎంతో మంది సినిమా హాళ్ల నిర్వాహకులు 50 శాతం సబ్సిడీతో సినిమా హాలు నిర్వహించడం వల్ల నష్టాల పాలయ్యే అవకాశం ఉందని తెరవకుండానే ఓడిపోయారు. కొంతమంది మాత్రం ధైర్యం చేసి తెరిచారు. అయితే ఇటీవలే సినిమా హాల్ సీటింగ్ పై కీలక నిర్ణయం తీసుకొని శుభ వార్త చెప్పింది కేంద్రం. నేటి నుంచి 100% సీటింగ్ కెపాసిటీ తో సినిమా హళ్ళు నిర్వహించుకోవచ్చు అంటూ కేంద్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునేందుకు రోజంతా కౌంటర్ ఓపెన్ చేసి ఉంచాలి అంటూ నిబంధన పెట్టింది. అంతేకాకుండా తప్పనిసరిగా సినిమా హాల్లో కరుణ నిబంధనలు పాటించాలి అని సూచించింది. ప్రేక్షకుల రద్దీని తగ్గించేందుకు ఎక్కువ షోలు వెయ్యాలి అంటూ సూచించింది కేంద్రం.