
అలాంటి కొరటాల అభిమానులు లేటెస్ట్ గా విడుదలైన ‘ఆచార్య’ టీజర్ ను చూసి అసంతృప్తి వ్యక్త పరుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ టీజర్ విడుదలైన కొన్ని నిమిషాల్లోనే రికార్డు స్థాయి వ్యూస్ అందుకుంది. ప్రస్తుతం ఈటీజర్ యూట్యూబ్ లో కొన్ని మిలియన్స్ పైగా వ్యూస్ లక్షల లైక్స్ తో ట్రెండింగ్ గా మారిపోయింది.
రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ టీజర్ మెగా అభిమానులకు మాత్రమే కాకుండా సాధరణ సినిమా ప్రేక్షకులకు కూడ బాగా కనెక్ట్ అయింది. ‘పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో ఆచార్య అంటుంటారు. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో’ అని మెగాస్టార్ చెప్పిన డైలాగ్ ప్రస్తుతం ట్రేండింగ్ గా మారింది. అయితే ఇది అంత నాణానికి ఒక వైపు మాత్రమే. మరో వైపు ఈ టీజర్ లో కొరటాల శివ మార్క్ ఎక్కడో మిస్ అయిందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
‘ఆచార్య’ టీజర్ ను చూసిన కొరటాల అభిమానులు ఈమూవీ కొరటాల మూవీలా కాకుండా బోయపాటి మూవీలా మారబోతోందా అంటూ నిట్టూర్పులు విడుస్తున్నట్లు టాక్. అంతేకాదు కొరటాల చిరంజీవితో సినిమా తీసే అత్యుత్సాహంలో తన మార్క్ మేకింగ్ ను మిస్ అయ్యాడా అంటూ కొందరు కొరటాల అభిమానులు సందేహాలు వ్యక్త పరుస్తున్నట్లు టాక్. అయితే ఇది కేవలం టీజర్ మాత్రమే అనీ అసలు సినిమా విడుదల కాకుండా ఇలాంటి నెగిటివ్ అభిప్రాయం ఎందుకు రావాలి అంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా అప్పుడే ‘ఆచార్య’ పై నెగిటివ్ కామెంట్స్ దాడి ప్రారంభం కావడంతో ఈ విషయాల పై కొరటాల దృష్టి పెడతాడు అనుకోవాలి..