
కానీ, రాధేశ్యామ్ డైరెక్టర్ రాధ కృష్ణ మాత్రం ఫ్యాన్స్ కి ఎలాంటి న్యూస్ కాని అప్ డేట్స్ కాని ఇవ్వడం లేదు. కనీసం సినిమాకి సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు పండగలు, స్పెషల్ డేస్ అన్నీ కూడా అయిపోయాయి. టీజర్ మాత్రం రావడం లేదు. దీనికి కారణం ప్రభాసేనని సమాచారం అందుతుంది. అసలు కారణం అదేనట. రీసెంట్ గా రాధాకృష్ణ రెడీ చేసిన టీజర్ లో దమ్ములేకపోవడంతో వద్దని చెప్పాడట. అంతేకాదు, అందులో భారీ మార్పులు కూడా చెప్పినట్లుగా సమాచారం అందుతుంది.
అన్నీ కుదిరి ఉంటే ఈ టీజర్ ని ఫిబ్రవరి 14వ తేదిన ప్రేమికుల రోజు స్పెషల్ గా రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారు. మరి ఇప్పుడు ఈ మార్పులు చేసి ఈ టీజర్ ని రెడీ చేస్తారా లేదా అనేది అనుమానంగానే మారింది. పూజాహేగ్దే హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాని జూన్ లో విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. రిలీజ్ డేట్ కూడా త్వరలోనే రాబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.