అక్కినేని వారసుడిగా అఖిల్ మూవీ తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని అఖిల్. మాస్ డైరెక్టర్ వినాయక్ ఈ మూవీ ని డైరెక్ట్ చేయడం , మొదటి సారి హీరో నితిన్ ప్రొడ్యూస్ చేయడం తో ఈ సినిమా ఫై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేసింది. మొదటి రోజు మొదటి షో తోనే ప్లాప్ టాక్ మూటకట్టుకొని అఖిల్ తో పాటు అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది.

ఆ తర్వాత రెండో మూవీ హలో తో వచ్చాడు. మనం వంటి సూపర్ హిట్ ఫిలింను తెరకెక్కించి అక్కినేని అభిమానులను ఆకట్టుకున్న విక్రమ్ కుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. కానీ ఈ మూవీ కూడా ప్లాప్ అయ్యింది. ఇక అఖిల్ నుండి వచ్చిన మూడో మూవీ మిస్టర్ మజ్ను . ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఢమాల్ అయ్యి అఖిల్ కు నిరాశ తెప్పించింది. ఇక ఈ మూడు సినిమాల తర్వాత చాల గ్యాప్ తీసుకొని బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

మూవీ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ పూజా హగ్దే హీరోయిన్ గా నటిస్తుండగా.. జీఏ2 పిక్చర్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, వాసువర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అయితే గత కొద్దీ రోజులుగా సెట్స్ ఫై ఉన్న సినిమాలన్నీ తమ రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేస్తుండగా..బ్యాచిలర్ మాత్రం సైలెంట్ గా ఉన్నాడు. దీనికి కారణం ఏంటి అనేది అర్ధం కావడం లేదు. అగ్ర నిర్మాతలు , సక్సెస్ ఫుల్ హీరోయిన్ పూజా హగ్దే , బ్యాక్ గ్రౌండ్ కింగ్ నాగార్జున ఇలా ఇంతమంది ఉన్నప్పటికీ సినిమా రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించడం లేదు. సరైన సమయం కోసం చూస్తున్నారా..లేక సినిమా అవుట్ ఫుట్ సరిగా రాలేదా ఇది అర్ధం కాక అభిమానులు అయోమయం అవుతున్నారు. అఖిల్ నుండి సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు బ్యాచిలర్ రిలీజ్ డేట్ ఆలస్యం కావడం మింగుడు పడడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: