భారత చలన చిత్ర పరిశ్రమలో కొంతమంది మహానటులు దురదృష్టవశాత్తు మన మధ్య లేకపోయినప్పటికీ వారు వేసిన పాత్రలు మాత్రం చిరస్థాయిగా ప్రేక్షకుల మదిలో చిరస్తాయిగా నిలిచిపోయాయి. ఆ మహానటులు చేయలేని పాత్ర కానీ, వేయలేని వేషం కానీ ఏమీ మిగిలి ఉండలేదనే చెప్పవచ్చు. కామెడీ అయినా,సెంటిమెంట్ అయినా,విలన్ నిజమైన ఇలా నవరసాల్లో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసే నటులు ఎంతోమంది మన ఇండస్ట్రీలో ఉన్నారు. వారిలో ఒకరే ఆహుతిప్రసాద్ కూడా.
ఆహుతి ప్రసాద్ గత ఐదు సంవత్సరాల క్రితం కోలన్ క్యాన్సర్ వ్యాధి బారినపడి,జనవరి 4 2015వ సంవత్సరంలో కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇక ఈయన లేని లోటు సినీ ఇండస్ట్రీలో ఎవరూ పూడ్చలేనిది అనే చెప్పాలి. సుమారు 30 సంవత్సరాల కాలంలో దాదాపు 150 సినిమాలలో నటించి, ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఇప్పుడు ఆహుతి ప్రసాద్ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం.
టాలీవుడ్ లో అగ్ర కథానాయకులలో ఒకడిగా కొనసాగుతున్న అక్కినేని నాగార్జున మొదటి చిత్రం "విక్రమ్" సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన ఆహుతిప్రసాద్, అసలు పేరు అడుసుమిల్లి జనార్దన్ వరప్రసాద్. ఈయన కృష్ణా జిల్లాలోని కోడూరు గ్రామంలో రంగారావు, హైమావతి దంపతులకు జన్మించాడు. చిన్నప్పటి నుండి సినిమాల మీద విపరీతమైన ఆసక్తితో ఆహుతి ప్రసాద్, విక్రమ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై ప్రముఖ నిర్మాత శ్యాంప్రసాద్రెడ్డి దృష్టిని, విశేషంగా ఆకర్షించగలిగాడు. అప్పట్లో శ్యాంప్రసాద్ రెడ్డి యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ "ఆహుతి " సినిమాలో మెయిన్ విలన్ పాత్ర కోసం ప్రసాద్ ను తీసుకున్నాడు.
ఇక ఈ సినిమా రాజశేఖర్ జీవితాన్ని మలుపు తిప్పింది అనే చెప్పవచ్చు.
ఆహుతి ప్రసాద్ ఈ సినిమా తరువాత వెనక్కి తిరిగి చూడకుండా, వరుస విజయాలతో దూసుకెళ్లాడు. ఆ తర్వాత కృష్ణవంశీ తెరకెక్కించిన "నిన్నే పెళ్లాడతా" సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయడంతో,ఇక వరుసగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించేందుకు అవకాశాలు వెల్లువలా వచ్చి పడ్డాయి. ఇక అదే తదువు గా దాదాపు 3 దశబ్దాల కాలంలో మొత్తం 150 సినిమాల్లో నటించి, తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు ఆహుతి ప్రసాద్. ఇక ఈయన వ్యక్తిగత విషయానికొస్తే, విజయనిర్మల అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈయనకు కార్తీక్ ప్రసాద్ అనే కొడుకు ఉన్నాడు. కార్తీక్ ప్రసాద్ కూడా చూడటానికి అచ్చం హీరో లా కనిపిస్తాడు. తన తండ్రి మరణాంతరం కార్తీక్ తన కుటుంబ బాధ్యతలు తీసుకున్నాడు.