రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న సినిమా రాధేశ్యామ్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి రాధాకృష్ణ దర్సకుడు. అంతకుముందు గోపిచంద్ తో జిల్ మూవీ తీసిన రాధాకృష్ణ, తప్పకుండా ప్రభాస్ తో చేస్తున్న ఈ మూవీ తో సూపర్ హిట్ కొట్టేలా అద్భుతమైన కథ రాసుకున్నట్లు సమాచారం.

కొన్నేళ్ల క్రితం యూరోప్ లో జరిగిన ఒక యదార్ధ ప్రేమకథ కు దృశ్యరూపకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా, ఈ ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక దీని తరువాత మొత్తం మూడు సినిమాలు లైన్ లో పెట్టారు ప్రభాస్. వాటిలో ఒకటి నాగ అశ్విన్ తో చేయబోయే సినిమా, ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆదిపురుష్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్న సలార్. అయితే వీటిలో సలార్ ఇటీవల మొదలు కాగా, నిన్న ఆదిపురుష్ మూవీ ని అధికారికంగా ముంబై లో ప్రత్యేకంగా వేసిన ఒక సెట్ లో షూట్ ప్రారంభించారు.

అయితే ఒక్కసారిగా ఆ సెట్ లో మంటలు చెలరేగడంతో కొంత సెట్ కాలిపోయింది. దానితో యూనిట్ మొత్తం కొంత షాక్ అయింది. అయితే ఇక్కడ ఒక మంచి ఏమిటంటే, హీరో ప్రభాస్, విలన్ పాత్రధారి సైఫ్ ఆలీ ఖాన్ సహా యూనిట్ కి సంబందించిన ఎవరూ కూడా సెట్ లో లేకపోవడమే అని, అలానే మంటలు చెలరేగిన సమయంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని యూనిట్ వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే హఠాత్తుగా జరిగిన ఈ పరిణామం ఒకరకంగా మంచిదే అని, ఈ విధంగా తమ హీరో సినిమాకు ఉన్న దిష్టి మొత్తం కూడా పోయిందని, ఇకపై షూటింగ్ సజావుగా సాగడంతో పాటు మూవీ తప్పకుండా భారీ సక్సెస్ అందుకుంటుంది అని ప్రభాస్ ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిప్రాయ పడుతున్నారు. మరోవైపు మంచువారబ్బాయి మనోజ్ కూడా తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఈ విషయమై స్పందిస్తూ, ఆదిపురుష్ టీమ్ కి దీనితో తగిలిన దిష్టి అంతా పోయింది అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు..... !!

మరింత సమాచారం తెలుసుకోండి: