సీరియల్ లోని ప్రతీ పాత్ర కూడా ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా వంటలక్క పాత్రలో నటించిన ప్రేమే విశ్వనాధన్ పాత్ర ప్రేక్షకులందరికీ మరింత కనెక్ట్ అయిపోయింది. ఇక ఆ తర్వాత డాక్టర్ బాబు పాత్ర కూడా ఎంతగానో కనెక్ట్ అయిపోయింది. రెండు పాత్రల చుట్టే కార్తీకదీపం సీరియల్ తిరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక కార్తీకదీపం సీరియల్ కి ఎంతలా బుల్లితెర ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యారు అంటే.. కార్తీకదీపం సీరియల్ వస్తుందంటే చాలు ఎన్ని పనులున్నా అక్కడే వదిలేసి టీవీ ముందుకు వచ్చి కూర్చుంటారు ఇక ఆ సమయంలో ఎవరైనా ఛానల్ మార్చారా ఇక వారి పరిస్థితి అదోగతి.
ఇలా బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షిస్తూ టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది కార్తీకదీపం సీరియల్. అయితే ఇటీవలే కార్తీకదీపం సీరియల్ బృందం మొత్తం మా టీవీ లో సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న.. స్టార్ట్ మ్యూజిక్ అనే కార్యక్రమానికి వచ్చారు. ఈ క్రమంలోనే కార్తీక దీపం డాక్టర్ బాబు పాత్రలో నటిస్తున్న నీరూపమ్ కూడా వచ్చాడు. నిరుపమ్ రాగానే కత్తి పట్టుకున్న యాంకర్ సుమ.. నువ్వు మా వంటలక్కను ఎందుకు అంతలా బాధ పెడుతున్నావ్ అంటూ బెదిరిస్తుంది. ఇక అంతలో అయ్యో డాక్టర్ బాబు మీకు కత్తి చూపించానా అంటూ యాక్టింగ్ చేస్తుంది.. ఆ తర్వాత మళ్లీ కత్తి చూపించి డాక్టర్ బాబు ఇంకోసారి మా వంటలక్క ను బాధ పెట్టావో అస్సలు బాగోదు అంటూ వార్నింగ్ ఇస్తుంది. ఇక దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.