ఈమూవీ ప్రారంభంలో శివగామి పాత్రలో నటించిన రమ్యకృష్ణ నదిలో కొట్టుకుపోతూ తన చేతిలోని బిడ్డను నదిలో కొట్టుకుపోకుండా చేతిని పైకెత్తి రక్షించిన సీన్ ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాలలో సుస్థిరంగా నాటుకుపోయింది. ఆ పాప ఎవరు అన్న విషయం అప్పట్లో ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆపాప ఇప్పుడు పెరిగి పెద్దది కావడంతో ఆ పాప గురించి మీడియా వార్తలు ప్రచురిస్తోంది.
ఆ చిన్నారి పేరు తన్వి చెన్నైలో ప్రస్తుతం పెరుగుతున్న ‘బాహుబలి’ లోని ఆ 6 నెలల చిన్నారి ఇప్పుడు పెరిగి పెద్దదై స్కూల్ కు వెళుతుందట. ఆ పాప చెన్నై లోని ఒక స్కూల్ లో ప్రస్తుతం యు కేజీ చదువుతోందని తెలుస్తోంది. ఆపాప ‘బాహుబలి’ లో నటించింది అనీ ఆ స్కూల్ యాజమాన్యానికి అదేవిధంగా ఆ స్కూల్ లోని టీచర్స్ కు తెలియడంతో ఆపాప ఆ స్కూల్ లో సెలెబ్రెటీగా మారిపోయింది.
అంతేకాదు తన్వి ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడ సెలెబ్రెటీగా హంగామా చేస్తోంది. ఆపాప తో ఆ స్కూల్ లోని టీచర్స్ అదేవిధంగా ఆ స్కూల్ పిల్లలు తీయించుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్న పరిస్థితులలో ఆ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ‘బాహుబలి’ సినిమాలో కొద్ది క్షణాలపాటు కనిపించిన తన్వి ఇలా సెలెబ్రెటీగా మారిపోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. అందుకే రాజమౌళి సినిమాలలో ఒక చిన్నపాత్ర చేసే అవకాశం వచ్చినా వదులుకోను సూర్యా లాంటి టాప్ హీరో ఒక సందర్భంలో అన్నాడు. ఏది ఏమైనా ‘బాహుబలి’ ప్రభాస్ రానా రాజమౌళి లకు మాత్రమే కాకుండా తన్వి కి కూడ నేషనల్ సెలెబ్రెటీ స్థాయిని కల్పించింది అనుకోవాలి..