మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమా "ఉప్పెన". ఈ సినిమాలో ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించారు. ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి కుమార్ కథను అందించగా...బుచ్చిబాబు సన దర్శకత్వం వహించారు. సినిమాను మైత్రీ మూవీమేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో విడుదల చేసారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రయూనిట్ సభ్యులందరికీ అల్ ద బెస్ట్ చెప్పారు. ఇక ట్రైలర్ విషయానికొస్తే ఈ సినిమా స్వచ్ఛమైన ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కినట్టు అర్థం అవుతోంది. ట్రైలర్ లో  ప్రేమపై ఉన్న ఎమోషన్ల్ డైలాగులు పేలాయి.. అంతే కాకుండా సినిమాలో విజయ్ సేతుపతి కారాదు గట్టిన విలన్ లా కనిపించబోతునట్టు స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక అన్ని కథల్లానే ఈ సినిమాలో కూడా కృతి శెట్టి గొప్పింటి అమ్మాయిగా...వైష్ణవ్ తేజ్ ఆమెను ప్రేమించే పేదింటి యువకుడిగా కనిపిస్తున్నాడు.

 ఇక విజయ్ సేతు పతి వారి ప్రేమను విడదీసే విలన్ పాత్రలో కనిపిస్తున్నారు. సినిమాలో వైష్ణవ్ తేజ్ గడ్డం..కొర మీసం లుక్ కనిపిస్తున్నాడు. ఇక మంగుళూరు బ్యూటీ కృతి శెట్టి పల్లెటూరి అందగత్తెలా మెరిసిపోతోంది. విలన్ పాత్ర చేస్తున్న విజయ్ సేతుపతి పక్కా మాస్ లుక్ లో కనిపోయిస్తున్నాడు. ఇక మ్యూజిక్ విషయానికొస్తే డిఎస్పీ అందించిన మ్యూజిక్ కు ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. "నీ కళ్ళు నీలి సముద్రం" పాట కి యూట్యూబ్ లో మిలియన్స్ వ్యూవ్స్ వచ్చాయి. టీజర్ లోనూ డిఎస్పీ మార్క్ కనిపించింది. ఇక ఈ సినిమాలో సాడ్ ఎండింగ్ ఉండబోతుందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి తగ్గట్టే ట్రైలర్ లో సన్నివేశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్ కోసం ముందు నుండి పలువురు హీరోల సపోర్ట్ ను తీసుకుంటున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు ప్రమోషన్ లో భాగం కాగా తాజాగా ఎన్టీఆర్ కూడా సినిమా ట్రైలర్ విడుదల చేసి ప్రమోషన్ లో భాగం అయ్యారు. ఇక మొత్తానికి మెగా మేనల్లుడి ఉప్పెన ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: