సినిమాలు ఎప్పుడూ గ్లామర్‌ చుట్టే తిరుగుతాయి. అందుకే గ్లామరస్‌ హీరోయిన్స్‌ ఫుల్‌ బిజీగా ఉంటారు. అయితే కొంతమంది హీరోయిన్స్‌కి మాత్రం ఎంత అందమున్నా, అదృష్టం మాత్రం వరించడం లేదు. తెలుగులో క్రేజీ ఆఫర్స్‌ అందుకోలేకపోతున్నారు. మరి బ్యాడ్‌లక్‌తో ట్రావెల్‌ చేస్తోన్న ఆ హీరోయిన్స్‌ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

అను ఇమ్మాన్యుయేల్‌ గ్లామరస్‌ ఇమేజ్‌తో కెరీర్‌ బిగినింగ్‌లోనే పవన్‌ కళ్యాణ్‌తో కలిసి సినిమా చేసింది. 'అజ్ఞాతవాసి'తో స్టార్‌ రేసులోకి వచ్చినట్లే కనిపించింది. కానీ ఈ ఫ్లాప్‌ తర్వాత అను ఇమ్మాన్యుయేల్‌ గ్రాఫ్‌ కూడా డౌన్‌ అవ్వడం మొదలుపెట్టింది. యంగ్‌స్టర్స్ నుంచి కూడా అనుకి పెద్దగా ఆఫర్స్ రావడం లేదు.

బ్యూటీ విత్ బ్రెయిన్‌ అనే మాటకి పర్ఫెక్ట్ ఎగ్జంపుల్ మాళవిక శర్మ. లాయర్‌గా ప్రాక్టీస్‌ చేస్తూనే సినిమాల్లోకి వచ్చింది. గ్లామరస్‌ క్యారెక్టర్స్‌తో మంచి క్రేజ్ తెచ్చుకుంది. రీసెంట్‌గా 'రెడ్‌' సినిమాతో హిట్‌ కూడా కొట్టింది. కానీ ఇప్పటికీ మాళవికని స్టార్‌ హీరోలు పెద్దగా కన్సిడర్ చేయడం లేదు.

ఇస్మార్ట్ బ్యూటీగా తెలుగు కుర్రాళ్లకి కనెక్ట్ అయిన హీరోయిన్‌ నిధి అగర్వాల్. ఈ సక్సెస్‌తోనే తెలుగుతో పాటు తమిళ్లోనూ సినిమాలు చేస్తోంది. అయితే ఎంత ట్రై చేసినా నిధి అగర్వాల్‌కి మాత్రం స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్స్‌ రాట్లేదు. ఇంకా భారీ సినిమాల కోసం ఎదురుచూస్తూనే ఉంది నిధి.

మొత్తానికి హీరోయిన్స్ ను గ్లామర్ ఇమేజ్ కాపాడలేకపోతోంది. అందం ఉంది కానీ.. ఏం లాభం అవకాశాలే వెన్నుచూపుతున్నాయి. ముఖ్యంగా తెలుగులో అను ఇమ్మానుయేల్ కు ఇలాంటి సిట్యుయేషన్ ఎదురవుతోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ తో సినిమాలు చేసిన అను ఇమ్మానుయేల్ గాడిలో మాత్రం పడటం లేదు. మాళవిక శర్మ పరిస్థితి కూడా అలానే ఉంది. అవకాశాలు వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్లిపోతున్నాయి. అరకొర సినిమాలతో సరిపెట్టుకుంటున్నా.. అవి ఆశించిన స్థాయిలో ఫలితాలు తీసుకురావడం లేదు.







మరింత సమాచారం తెలుసుకోండి: