టాలివుడ్ లో ఐతే కేరళ కుట్టీలు, బాలివుడ్ భామలు, లేదా తమిళమ్మాయిలు తప్ప తెలుగమ్మాయిలంటూ ఎవరూ లేరు . అసలు తెలుగమ్మాయిలను హీరోయిన్ గా ప్రోత్సహించరు. భాష రాకపోయినా హావభావాలు పలికించకపోయినా వెంటబడి మరీ ఇతర రాష్ట్రాల నుంచి హీరోయిన్లను ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. తప్ప తెలుగమ్మాయిలకు అవకాశం ఇవ్వాలని ఆలోచించే డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు మన తెలుగు సినీ పరిశ్రమలో కరువనే చెప్పాలి.
ఆనంది మాత్రం పక్కా తెలుగమ్మాయి అయినా తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. అప్పుడెప్పుడో బస్టాప్ సినిమాలో చేసింది.ఆ తర్వాత రెండు మూడు సినిమాల్లో నటించింది. తర్వాత మళ్లీ కనిపించలేదు. దీంతో తమిళ సినిమాలపై దృష్టి పెట్టింది. 2018లో వచ్చిన పెరియురమ్ పెరుమాల్ సినిమాలో హీరోయిన్ గా దుమ్మురేపింది. ఈ సినిమాలో ఆనంది నటనకు అవార్డులులు, ప్రశంసలు వచ్చాయి.
ఆనందికి మాత్రం తెలుగులో నటించాలని ఉంది. కానీ మనోళ్లు అవకాశాలు ఇవ్వరాయే. చేసేది లేక ఇన్నాళ్లూ ఎదురుచూసింది. ఎనిమిదేళ్ల వ్యవధిలో ఆమె పేరు వినపడిందీ అంటే ఆనంది రహస్యంగా పెళ్లి చేసుకున్నప్పుడు. తమిళంలో కో డైరెక్టర్ సోక్రటీస్ ని పెళ్లి చేసుకుంది. ఆమె పెళ్లి వార్తను చిన్న చిన్న వార్తా పత్రికలు. వెబ్ సైట్లు కవర్ చేశాయి. పెద్ద పెద్ద పత్రికలు, వార్తా ప్రపంచంలో ఆమె కనిపించలేదు. ఏ ప్రమోషన్ కీ నోచుకోలేదు.
ఎప్పటికైనా తెలుగులో మంచి పాత్రలు పోషించాలని ఆనంది ఎదురుచూస్తుంది. మంచి అవకాశాలు రాకపోతాయా అని వెయిట్ చేస్తోంది. మళయాళ, హిందీ భామలకు ఇచ్చిన ప్రిఫరెన్స్ తనకీ ఇవ్వకపోతారా అని కలలు కంటోంది.