తన అందచందాలతో.. వచ్చీ రాని తెలుగులో ముద్దుముద్దుగా మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ బామ. అయితే ఇప్పుడు మోనాల్ రియల్ లైఫ్ గురించి కాస్త తెలుసుకుందాం. మోనాల్ గజ్జర్ మే 13,1991 లో అహ్మదాబాద్, గుజరాత్ లో జన్మించింది. ఇక ఆమె చదువు విషయానికొస్తే కామర్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన తర్వాత, ఆమె ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ లో కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత ఆమె యోగా గురువు సలహా ప్రకారం 2011 రేడియో మిర్చి నిర్వహించిన మిర్చి క్వీన్ బి అందాల పోటీలో పాల్గొంది. అందులో ఆమె విజయాన్ని సొంతం చేసుకుంది. అలా మొదలైన ఆమె ప్రయాణం మేకప్ ఫీల్డ్ కు దగ్గర చేసింది. ఆ తర్వాత ఆమె మిస్ గుజరాత్ గా టైటిల్ అందుకని.. ఆ ఉత్సాహంతో గ్లామర్ ఫీల్డ్ వైపు అడుగులు వేసింది.
డ్రాకులా అనే మలయాళ చిత్రంతో సినీ పరిశ్రమకు పరిచయం అయింది. ఆశాభోంస్లే చిత్రంలో ఒక ప్రత్యేకమైన పాత్రలో మెరిసి అలరించింది. తమిళ చిత్ర పరిశ్రమలోనూ హీరోయిన్ గా కొన్ని సినిమాలకు సైన్ చేసింది. ఇక టాలీవుడ్ లో అల్లరి నరేష్ హీరోగా నటించిన సుడిగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. 2012 భీమినేని శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ తర్వాత వెన్నెల సినిమాలో నటించింది. అటు హిందీ పరిశ్రమల్లోనూ "మై" అనే చిత్రంలో అతిధి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత తెలుగులో ఓ కాలేజ్ స్టోరీ అనే మూవీలో నటించింది కానీ ఈ సినిమా ఆమెకు ఎటువంటి గుర్తింపు తెచ్చి పెట్టలేదు.
ఇక తెలుగులో ఆమె చేసిన రెండో చిత్రం "బ్రదర్ ఆఫ్ బొమ్మాళి". ఇందులో అల్లరి నరేష్ తో రెండోసారి జతకట్టింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా తర్వాత ఆమె గుజరాతీ చిత్ర పరిశ్రమ వైపు మొగ్గు చూపింది. అక్కడ వరుస అవకాశాలు దక్కించుకుంది మోనాల్ గజ్జర్. ఇలా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు గుజరాతీ చిత్రాలలో బహుభాషా నటిగా నటించి ప్రఖ్యాతి పొందింది మోనాల్. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఇచ్చిన క్రేజ్ తో పలు ప్రముఖ షోలలో అవకాశం దక్కించుకుని సందడి చేస్తోంది ఈ అందాల గుజరాతి బొమ్మ.