తెలుగు చిత్ర పరిశ్రమలో థియేటర్ల వద్ద ఫ్లాపు అయినా సినిమాలు టీవీలో టీఆర్పీ మాత్రం దూసుకెళ్తుంది. ఇక చిరంజీవి అంజి సినిమా ఎందుకో తెలియదు కానీ థియేటర్స్‌లో మాత్రం డిజాస్టర్ అయింది. కానీ ఇదే సినిమా టీవీలో వచ్చినపుడు మాత్రం తెగ చూస్తుంటారు ఆడియన్స్. మహేష్ బాబు ఖలేజా సైతం నిర్మాతలకు భారీ నష్టాలు తీసుకొచ్చింది. కానీ శాటిలైట్ రైట్స్ కొన్న జెమినికి మాత్రం లాభాట పంట ఇప్పటికీ పండిస్తూనే ఉంది. ఇందులో మహేష్ బాబు కామెడీ టైమింగ్ అదుర్స్ అంతే.

ఇక మగధీర లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత రామ్ చరణ్ చేసిన సాఫ్ట్ లవ్ స్టోరీ ఆరెంజ్. ఇది అప్పట్లో ఆడియన్స్‌కు ఎక్కలేదు కానీ కొన్నేళ్ల తర్వాత ఆరెంజ్ టీవీలో మాత్రం రచ్చ చేస్తుంది. ఇప్పటికీ దీనికి మంచి రేటింగ్స్ వస్తుంటాయి. బోయపాటి తెరకెక్కించిన వినయ విధేయ రామ 2019 సంక్రాంతికి వచ్చి దారుణమైన పరాజయం పాలైంది. కానీ ఇదే సినిమా టీవీలో మాత్రం అదిరిపోయే రేటింగ్స్ తీసుకొస్తుంది.

అయితే రామ్ హీరోగా కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఉన్నది ఒకటే జిందగీ కూడా థియేటర్స్‌లో అంతగా ఆడలేదు. కానీ ఇదే ఫీల్ గుడ్ లవ్ స్టోరీ టీవీలో వచ్చినపుడు కన్నార్పకుండా చూసే అభిమానులున్నారు. సుకుమార్ డిఫెరెంట్ యాక్షన్ థ్రిల్లర్ నేనొక్కడినే థియేటర్స్‌లో ఆడియన్స్‌కు అర్థం కాలేదు. కానీ ఈ సినిమా తర్వాత ఎప్పుడు టీవీలో వచ్చినా కూడా ఎమోషన్‌కు కనెక్ట్ అయిపోతుంటారు అదే ప్రేక్షకులు. అందుకే రేటింగ్స్ అదిరిపోతుంటాయి.

ఇక మహేష్ బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్స్‌లో ఆగడు కూడా ఉంటుంది. శ్రీనువైట్ల తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్స్‌లో చిరాకు పెట్టినా టీవీలో మాత్రం బాగానే ఆకట్టుకుంటుంది. పైసా వసూల్ ఫ్లాప్ అయినా కూడా పూరీ అంటే బాలయ్యకు ఎనలేని యిష్టం. అందుకే టీవీలో ఎప్పుడొచ్చినా రేటింగ్ కూడా బాగానే వస్తుంటుంది. ఇక పూరీ జగన్నాథ్, ప్రభాస్ బుజ్జిగాడు సినిమా కూడా నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్మెంట్ ఉంటుంది. కానీ థియేటర్స్‌లో దీనికి సరైన రెస్పాన్స్ రాలేదు. కానీ మా టీవీ, జీ టీవీ బుజ్జిగాడును బాగా వాడేసుకున్నాయి. ఇప్పటికీ దీనికి టీఆర్పీ బాగానే వస్తుంటుంది.

అయితే కార్తికేయ హీరోగా వచ్చిన 90ఎమ్ఎల్ సినిమా కూడా టీవీలో వచ్చిన ప్రతీసారి కనీసం 4 రేటింగ్ తీసుకొస్తుంది. ఇప్పటికే 6 సార్లు వచ్చిన ఈ సినిమా తొలిసారి ఏకంగా 10 పైనే రేటింగ్ తీసుకొచ్చింది. చిరంజీవి, విజయ భాస్కర్ కాంబినేషన్‌లో త్రివిక్రమ్ రచనతో వచ్చిన సినిమా జై చిరంజీవ. 2006లో వచ్చిన ఈ సినిమా అప్పటి పరిస్థితులకు ఎందుకో థియేటర్స్‌లో సెట్ అవ్వలేదు. కానీ ఈ సినిమా టీవీలో ఎప్పుడొచ్చినా రేటింగ్స్ మాత్రం కుమ్మేస్తుంటుంది.










మరింత సమాచారం తెలుసుకోండి: