కోలీవుడ్ లో ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న భామ ఐశ్వర్యా రాజేష్. తెలుగు అమ్మాయే కాని అక్కడ ఉంటూ అక్కడే పాపులర్ అయ్యింది. అక్కడ ఆమె నాచురల్ నటనకు సూపర్ క్రేజ్ ఏర్పడింది. అయితే తెలుగులో మాత్రం ఆమెకు ఆశించిన స్థాయిలో క్రేజ్ రాలేదు. కౌశల్యా కృష్ణమూర్తి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అమ్మడు విజయ్ దేవరకొండతో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటించినా లాభం లేకుండాపోయింది.

ప్రస్తుతం టక్ జగదీష్, సాయి ధరం తేజ్ రిపబ్లిక్ సినిమాల్లో నటిస్తున్న అమ్మడు తెలుగులో స్టార్ డం కోసం ప్రయత్నిస్తుంది. స్టార్ సినిమాల్లో ఎక్కువ లెంగ్త్ ఉన్న పాత్రలు రాకపోయినా ఉన్న నాలుగు సీన్లు అయినా బలంగా ఉండాలని అంటుంది ఐశ్వర్య అలాంటి పాత్రలు వస్తే చేయడానికి సిద్ధమే అంటుంది అమ్మడు. అంతేకాదు బోల్డ్ పాత్రల్లో మాత్రం అసలు చేసే ఛాన్స్ లేదని. ఆ పాత్రలు చేయడం కన్నా ఆ సినిమాల ఆఫర్లు వదులుకుంటా అని అంటుంది ఐశ్వర్య రాజేష్.

అయితే కథ డిమాండ్ చేస్తే మాత్రం లిప్ లాక్ చేసేందుకు మాత్రం రెడీ అని అంటుంది. తమిళంలో మంచి నటిగా క్రేజ్ తెచ్చుకున్న ఐశ్వర్యా రాజేష్ కు తెలుగులో కూడా మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నారు ఆమె ఫ్యాన్స్. అయితే నాని, సాయి ధరం తేజ్ లాంటి యువ హీరోల సినిమాల్లో నటిస్తుంది కాబట్టి తప్పకుండా రానున్న రోజుల్లో అమ్మడికి తెలుగులో కూడా మంచి అవకాశాలే వస్తాయని చెబుతున్నారు. తమిళంలో మాత్రం అమ్మడు ఎప్పుడూ చేతినిండా సినిమాలతో సత్తా చాటుతుంది.                                                     



మరింత సమాచారం తెలుసుకోండి: