ఇటీవల బాలీవుడ్ నటులు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా ప్రఖ్యాత నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్ పై తెరకెక్కిన ప్రతిష్టాత్మక సినిమా వార్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ తర్వాత గొప్ప విజయాన్ని అందుకుంది. హిందీ సహా పలు ఇతర భాషల్లో ఎంతో గ్రౌండ్ లెవెల్ లో రిలీజ్ అయిన ఈ సినిమా కి సీక్వెల్ గా వార్ 2 తెరకెక్కనుంది అంటూ కొన్నాళ్లుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి.
అలానే ఈ సీక్వెల్ లో హృతిక్ తో పాటు ప్రభాస్ మరొక హీరోగా నటించనున్నాడని కూడా వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త బాలీవుడ్ తో పాటు పలు టాలీవుడ్ వర్గాల్లో కూడా విస్తృతంగా వైరల్ అవుతోంది. దాని ప్రకారం వార్ 2 మూవీ లో హృతిక్ తోపాటు మహేష్ బాబు నటించనున్నారని దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ మొదట ప్రభాస్ తో ఆ పాత్ర చేయించాలని భావించినప్పటికీ ప్రస్తుతం ఆయన వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉండటంతో ఆయన స్థానంలో మహేష్ ని తీసుకుంటున్నారని అంటున్నారు. ఇక మహేష్ కి సౌత్ ఇండియా తో పాటు బాలీవుడ్ లో కూడా విపరీతమైన క్రేజ్ ఉండటం కూడా తమకు కలిసి వస్తుందని భావిస్తున్నయూనిట్ ఎట్టి పరిస్థితుల్లో మహేష్ ని ఈ రోల్ కోసం ఒప్పించేందుకు ప్రయత్నం కూడా చేస్తోందట.
అతి త్వరలో మహేష్ ని కలిసి ఈ సినిమా కథ వినిపించేందుకు దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ సిద్ధం అవుతున్నాడని అంటున్నారు. మరోవైపు హృతిక్ కూడా తొలిసారిగా మహేష్ తో జత కట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారని దీపికా పదుకొనే, కత్రినాకైఫ్ ఇందులో హీరోయిన్స్ గా నటించే అవకాశం ఉందని అలానే ఫస్ట్ పార్ట్ ని మించేలా మరింత భారీ ఖర్చుతో అత్యున్నత సాంకేతిక విలువలతో యశ్ రాజ్ ఫిలింస్ వారు ఈ మూవీని మరింత గ్రాండ్ గా నిర్మించనున్నారని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే దీనిపై అధికారిక న్యూస్ బయటకు వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు.....!!