టాలీవుడ్ లో ఒకవైపు మంచి నిర్మాతగా, మరోవైపు హీరోగా రాణిస్తున్నాడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. అయితే ఈ మద్య కాలంలో హీరోగా కళ్యాణ్ రామ్ నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి.. అందుకే తన పంథా మార్చి ఈసారి చాలా డిఫరెంట్ గా డిటెక్టివ్ పాత్రను పోషించబోతున్నాడట. ఈ సినిమాకి ఏజెంట్ వినోద్ అనే టైటిల్ ని ఖరారు చేశారు.. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌తో పాటు ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్తున్నారు. పీరియాడికల్ కథాంశం కావడం.. 1940 ఎన్‌విరాన్మెంట్ చూపించాల్సి ఉండడంతో ఈ సినిమా మేకింగ్‌లో వీఎఫ్‌ఎక్స్‌ కీలకంగా మారనున్నాయని అంటున్నారు.

 అభిషేక్ పిక్చర్స్ వారు భారీగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇంతకీ ఈ భారీ ప్రాజెక్టుని డీల్ చేస్తున్న డైరక్టర్ ఎవరూ అంటే...ఆ మధ్యన అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలో వచ్చిన 'బాబు బాగా బిజీ' ఫేమ్‌ నవీన్‌ మేడారం ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు.బాబు బాగా బిజీ సినిమా తెలుగులో డిజాస్టర్ అయ్యింది. ఇదొక బూతు సినిమాగా పేరు తెచ్చుకుంది. అయినా వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత ఇదే దర్శకుడు ఆహా కోసం సిన్ అనే వెబ్ సీరిస్ ని చేసారు. ఇప్పుడు కళ్యాణ్ రామ్ తో సినిమా చేస్తున్నారు.నందమూరి కళ్యాణ్ రామ్ తెరపై కనిపించి ఏడాది దాటిపోయింది.
 
గత సంక్రాంతికి ఎంత మంచివాడవురా సినిమాతో పలకరించిన కళ్యాణ్ రామ్సినిమా తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు వార్తల్లోకి వచ్చారు. ఈ మధ్యకాలంలో 118 సినిమా మాత్రమే కళ్యాణ్ రామ్ కు హిట్ ఇచ్చింది.ఆ తర్వాత వచ్చిన ఎంత మంచివాడవురా పెద్ద షాకే ఇచ్చిందని చెప్పాలి.మరో ప్రక్క కల్యాణ్ రామ్‌ ప్రజెంట్ మల్లిడి వేణు సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్.. 'ఒక్క క్షణం', 'ఎక్కడికి పోతావు చిన్నవాడ', డిస్కోరాజా' వంటి ఢిఫరెంట్ సినిమాలను తెరకెక్కించిన వీఐ ఆనంద్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం...!!




మరింత సమాచారం తెలుసుకోండి: