అయితే పాన్ ఇండియా సినిమాలతో పాటు.. పవర్ ఫుల్ బిజినెస్ లు కూడా చేస్తున్నాడు. అయితే ఇప్పుడీ హీరోను యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫాలో అవుతున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా వల్ల ఇన్నేళ్లు కలిసి తిరిగిన ప్రభావమో.. లేదా చరణ్ టూ హ్యాండ్ కాన్సెప్ట్ నచ్చిందో లేదో తెలియదు కాని… జూనియర్ ఎన్టీఆర్ కూడా.. చరణ్ లా బిజినెస్ మ్యాన్ అవ్వాలని ట్రై చేస్తున్నాడట. అన్న కళ్యాణ్ రామ్ బ్యానర్ కాకుండా తనకంటూ ఓ బ్యానర్ ఏర్పాటు చేసుకోవాలిని పిక్స్ అయ్యాడట. అయితే గతంలోనూ ఈ వార్త హల్ చల్ చేసింది. కానీ ఆ తర్వాత చడీచప్పుడు లేకుండా పోయింది.
ఇక తాజాగా మరోసారి ఈ విషయం టాలీవుడ్ లో చర్చకు వచ్చింది. ఓన్ ప్రొడక్షన్ విషయమై ఇప్పటికే ప్రొడక్షన్ లో దూసుకుపోతున్న చరణ్ ను సలహా అడగగా.. చరణ్ పూస గుచ్చినట్టు మరీ సొంత ప్పొడక్షన్ వల్ల వచ్చే లాభాలను వివరించాడట. దీంతో ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ, పిల్లల పేర్లు కలిసి వచ్చేలా.. పేర్లు పరిశీలిస్తున్నారట. ఈ ప్రొడక్షన్ హౌస్ లో కొత్త దర్శకులను యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయనున్నాడట యంగ్ టైగర్.