నందమూరి తారక్ చాలా కాలం తర్వాత మరో సినిమా చేశారు. అయితే ఈ సినిమాకి దేవినేని అనే టైటిల్ పెట్టి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ నేపథ్యంలోనే నందమూరి తారక పై వైసీపీ లీడర్లు కేసును నమోదు చేశారు. ఈ విధంగా నందమూరి హీరో పై వైసీపీ లీడర్ కేసు వేయడానికి గల కారణం ఈ సినిమా ప్రముఖ వైసిపి నాయకుడైన దేవినేని నెహ్రూ, దేవినేని అవినాష్ నందమూరి తారక రత్న తాజాగా నటిస్తున్న దేవినేని సినిమాలో తన తండ్రి దేవినేని నెహ్రూ జీవితాన్ని దేవినేని పేరుతో సినిమా తీస్తున్నారంటూ ఆరోపించారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో తన అనుమతి తీసుకోలేదని, దేవినేని సినిమా విడుదల చేయకుండా నిలిపివేయాలంటూ ఈ సినిమా పై దేవినేని అవినాష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేవలం నందమూరి తారక్ పై మాత్రమే కాకుండా, ఈ సినిమా నిర్మాత జిఎస్ఆర్, రాము రాథోడ్, చిత్ర దర్శకుడు నర్రా శివ నాగేశ్వరరావు పై అవినాష్ కేసును నమోదు చేశారు. దేవినేని సినిమాపై కేవలం అవినాష్ మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురు వైసిపి లీడర్లు కూడా దేవినేని సినిమాను నిలిపివేయాలంటూ ఒత్తిడి చేయడంతో ఫిలిం ఛాంబర్ పెద్దలు సమావేశమై ఈ సినిమా విడుదల విషయం గురించి చర్చించారు.

దేవినేని పేరు పెట్టడమే ఈ సినిమాకు సమస్య:

దేవినేని సినిమాలో దేవినేని నెహ్రూ జీవితం ఆధారంగా దేవినేని పాత్రలు నందమూరి తారక్ నటించారు. అదేవిధంగా దేవినేని సినిమాలో వంగవీటి రంగా పాత్రలో సంతోషం సురేష్, వంగవీటి రాధా పాత్రలో బెనర్జీ నటించారు. వీరే కాకుండా ఇతర ప్రముఖ అయినా
చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్నకుమార్‌, ఐపీఎస్ వ్యాస్ పాత్రలో మ్యూజిక్ డైరెక్టర్ కోటి నటించాడు. బెజవాడ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కుతున్న దేవినేని సినిమా చిత్రీకరణ పూర్తయింది. విడుదల సమయానికి ఈ విధంగా వైసీపీ లీడర్లు కేసు నమోదు చేయడంతో ఈ సినిమా విడుదలపై దర్శకనిర్మాతలు అయోమయంలో పడ్డారు. అయితే తొందరలోనే ఈ చిత్రం విడుదలకు సంబంధించి ఓ నిర్ణయానికి రానున్నట్లు చిత్రబృందం తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: