నాని ఫ్యాన్స్ కు ఈ బర్త్ డే రోజు డబుల్ ధామాకా ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఈ సర్ ప్రైజులు నాని ఫ్యాన్స్ ను కచ్చితంగా ఖుషి చేస్తాయని అంటున్నారు. నాని టక్ జగదీష్ లో తీరు వర్మ, ఐశ్వర్యా రాజేష్ నటిస్తుండగా.. శ్యాం సింగ రాయ్ సినిమాలో కృతి శెట్టి, సాయి పల్లవిలు నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల్లో నలుగురు భామలతో నాని జోడీ కడుతున్నాడు. నాని సినిమా అంటే మినిమం గ్యారెంటీ అన్న టాక్ వచ్చింది.
అయితే నాని విలన్ గా వి అంటూ లాస్ట్ ఇయర్ చేసిన ప్రయత్నం ఫెయిల్ అయ్యింది. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇదిలాఉంటే నాని మాత్రం టక్ జగదీష్, శ్యాం సింగ రాయ్ సినిమాలతో మళ్లీ సత్తా చాటాలని చూస్తున్నాడు. మరి నాని చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.