కొడుకు మోక్షజ్ఞ త్వరలో సినీ ఎంట్రీ కి సిద్ధమవుతున్న వేళా పెద్దమ్మాయి ని చంద్రబాబు కొడుకు లోకేష్ కి ఇచ్చి పెళ్లి చేశాడు. చిన్నమ్మాయి తేజస్విని వైజాగ్ గీతం సంస్థలకు చెందిన శ్రీ భరత్ కి ఇచ్చి పెళ్లి చేశారు... ఇకపోతే వీరి గురించి ఎంతో కొంత తెలుసు కానీ అయన భార్య వసుంధర గురించి ఎవరికీ పెద్దగా తెలీదు. 1982లో వీరి వివాహం జరిగింది.. శ్రీ రామదాసు మోటార్ ట్రాన్స్ పోర్ట్ అధినేత అయిన దేవరపల్లి సూర్యరావు గారి అమ్మాయి బాలకృష్ణ భార్య వసుంధర..
స్వతహాగా వందల కోట్ల ఆస్తికి వారసురాలు ఆవిడ.వసుంధర గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత బాలకృష్ణ గారిని పెళ్లి చేసుకున్నారు.. ఇక ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు దీని తర్వాత రీసెంట్ గా రవితేజతో క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడని దానిని మైత్రి మూవీస్ వారు నిర్మించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి ఈ సినిమా తర్వాత అప్పట్లో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో పైసా వసూల్ సినిమా తీస్తున్నప్పుడు బాలకృష్ణ పూరికి ఇంకో సినిమా చేద్దాం అని మాటిచ్చాడంట దీని తర్వాత పూరి జగన్నాథ్ సినిమానే ఉంటుందని బాలకృష్ణ అభిమానులు అంటున్నారు.