మరోవైపు బాలయ్య తో పాటు బోయపాటి కూడా ఫ్లాప్స్ లో ఉండడంతో ఆయన ఈ మూవీ ని ఎలా తీస్తారా అనే ఆసక్తి కూడా మరికొందరిలో నెలకొని ఉంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ యొక్క తాజా షెడ్యూల్ పల్నాడు లో జరుగుతున్నట్లు సమాచారం. బాలయ్య ఇందులో డబుల్ రోల్ చేస్తుండగా యువ భామ ప్రగ్య జైస్వాల్ ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని యువ నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి ఎంతో భారీ ఖర్చుతో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై దీనిని నిర్మిస్తున్నారు.
అయితే ఈ సినిమా విషయమై ప్రస్తుతం ఒక వార్త పలు టాలీవుడ్ వర్గాల్లో విస్తృతంగా వైరల్ అవుతోంది. అదేమిటంటే ఈ మూవీలో వచ్చే యాక్షన్, ఫైట్ సన్నివేశాలు థియేటర్ లో నెవర్ బిఫోర్ నెవర్ ఎగైన్ అనే రేంజ్ లో ఉంటాయని, ముఖ్యంగా బాలయ్య ఇంట్రడక్షన్ సీన్, హై వోల్టేజ్ ఇంటర్వెల్ ఎపిసోడ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు అయితే అదరహో అని అంటున్నారు. తనకు ఎంతో ఇష్టమైన బాలయ్యతో చేస్తున్న మూడవ సినిమా కావడంతో యాక్షన్, ఫైట్ సీన్స్ విషయమై బోయపాటి మరింత జాగ్రత్త వహిస్తున్నారని, తప్పకుండా ఈ మూవీ రేపు రిలీజ్ తరువాత బాలయ్య ఫ్యాన్స్ ని కాలర్ ఎగరేసేలా చేయడం ఖాయం అని సమాచారం. మరి అది ఎంతవరకు జరుగుతుందో తెలియాలంటే ఈ మూవీ రిలీజ్ సమయం వరకు వెయిట్ చేయాల్సిందే....!!