తమిళ సినీ ఇండస్ట్రీలో అగ్ర నటిడిగా అజిత్ కి ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..తమిళ అభిమానులు ముద్దుగా తల అని పిలుచుకునే ఈ హీరో  కెరీర్ ప్రారంభంలో లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఆ తర్వాత యాక్షన్ హీరోగా కూడా సత్తా చాటాడు. ఇక అజిత్‌కు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఎందరో అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా రజినీకాంత్, విజయ్ లాంటి స్టార్స్ తరువాత అత్యదిక అభిమానులు కలిగి ఉన్న హీరోల్లో అజిత్ ఒకరు.అలాంటి అజిత్ తాజాగా ఘోరంగా మోసపోయాడు. ఇంతకీ ఆయనను మోసం చేసింది ఎవరో కాదు గూగుల్‌ మ్యాప్.

 పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చెన్నై నగర పోలీసు కమిషనర్‌ పాత కార్యాలయం స్థానిక ఎగ్మూరులో ఉంది. ఈ ప్రాంగణంలోనే రైఫిల్‌ క్లబ్ ఉండగా.. అక్కడ అజిత్‌ సభ్యుడుగా ఉన్నారు.అయితే తన చిత్రం కోసం రైఫిల్‌ షూటింగ్‌ శిక్షణ కోసం ఈ క్లబ్‌కు గురువారం ఉదయం ఈసీఆర్‌లోని తన నివాసం నుంచి కారులో బయలుదేరారు.అక్కడకు చేరుకునేందుకు గూగుల్‌ మ్యాప్‌ సాయం తీసుకోని అజిత్ ప్రయాణించగా.. చివరకు స్థానిక వెప్పేరిలోని కొత్త పోలీసు కమిషనరు కార్యాలయం వద్దకు చేరుకున్నాడు. అనంతరం అజిత్‌ కారు దిగి.. మాస్క్ తీయడంతో స్థానిక ప్రజలు గుర్తి పట్టి ఫొటోలు వీడియో తీసుకుంటూ సందడి చేశారు.

 ఇంతలోనే రైఫిల్‌ క్లబ్‌ ఇక్కడ లేదనీ పాత కమిషనరేట్‌లో ఉందని సెక్యూరిటీ సిబ్బంది అజిత్ వెనుదిరిగారు. మొత్తానికి గూగుల్ మ్యాప్‌ మోసం చేయడంతో ఒక ప్రాంతానికి వెళ్ళాల్సిన అజిత్‌. మరో ప్రాంతానికి వెళ్ళి ప్రజలకంట పడ్డాడు..అలా మన తల అజిత్..గూగుల్ మ్యాప్ వల్ల మోసపోయాడన్నమాట..ఇక ప్రస్తుతం అజిత్ వాలిమై అనే సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.ఇలాంటి మరెన్నో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని తప్పకుండా ఫాలో అవ్వండి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: