తొలిసారిగా ప్రభాస్ హీరోగా మిర్చి మూవీతో దర్శకుడిగా మెగా ఫోన్ పట్టిన కథకుడు కొరటాల శివ ఫస్ట్ మూవీ తోనే బెస్ట్ హిట్ కొట్టి టాలీవుడ్ ప్రేక్షకుల మెప్పు పొందారు. ఆ తరువాత ఏకంగా సూపర్ స్టార్ మహేష్ తో శ్రీమంతుడు వంటి ఇండస్ట్రీ హిట్ మూవీ తీసిన కొరటాల దర్శకుడిగా ద్వితీయ విఘ్నాన్ని కూడా అధిగమించారు. అనంతరం ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్, ఆపై మారొకసారి మహేష్ తోనే భరత్ అనే నేను వంటి సూపర్ హిట్స్ తీసి మంచి సక్సెస్ఫుల్ దర్శకుడిగా కొనసాగుతున్న కొరటాల ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో తీస్తున్న సినిమా ఆచార్య.
మెగాస్టార్ ఇందులో మాజీ నక్సలైట్ గా కనిపించనుండగా రామ్ చరణ్ సిద్ద అనే పాత్రలో కనిపించనున్నట్లు టాక్. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా సమ్మర్ కానుకగా మే 13న రిలీజ్ కానుంది. అయితే దీని తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కొరటాల శివ ఒక ప్రతిష్టాత్మక సినిమా తీయనున్నారు. ఎంతో భారీ ఎత్తున పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కనున్న ఈ సినిమా యొక్క ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు అతి త్వరలో ప్రారంభం కానునంట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. మంచి యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కనుందని అంటున్నారు. ఇక అల్లు అర్జున్ ఇమేజ్ కి సరిపోయే విధంగా అలానే అన్ని వర్గాల ఆడియన్స్ ని కూడా ఆకట్టుకునేలా ఈ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం.
కాగా ఈ మూవీలో అల్లు అర్జున్ విద్యార్థి నాయకుడిగా నటించనున్నాడని, కళాశాలల్లో జరిగే రాజకీయాల నేపథ్యంలో ఈ మూవీ రూపొందనుందని, ఒక స్టార్ నటి ఇందులో అల్లు అర్జున్ కి జతగా నటించనుందని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మూవీని సక్సెస్ చేసేలా ఇప్పటికే తన బృందంతో కలిసి స్క్రిప్ట్ ని పక్కాగా సిద్ధం చేసిన కొరటాల, అల్లు అర్జున్ ప్రస్తుతం చేస్తున్న పుష్ప పూర్తి అయిన వెంటనే దీనిని పట్టాలెక్కించేలా ప్లాన్ చేశారట. మొత్తంగా చూస్తుంటే భరత్ అనే నేను లో సూపర్ స్టార్ ని ముఖ్యమంత్రిని చేసి సూపర్ హిట్ కొట్టిన కొరటాల, ఈ మూవీలో స్టైలిష్ స్టార్ ని విద్యార్థి నాయకుడిని చేసి మరొక సూపర్ హిట్ కొట్టేలా ఉన్నారని అంటున్నారు....!!