ప్రముఖ సౌత్ ఇండియన్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నితిన్ హీరోగా నటించిన చెక్ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 26వ తేదీన విడుదల కానున్నది. అయితే ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. కాగా, ఈ ఈవెంట్ కి రకుల్ ప్రీత్ సింగ్ హాజరుకాలేదు.


ముంబైలో సినిమా షూటింగులతో చాలా బిజీగా ఉన్నానని.. అందుకే తాను చెక్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనలేక పోతున్నానని ఆమె ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దీనితో సినిమా షూటింగ్ ని ఒకరోజు వాయిదా వేసి.. చెక్ మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు కదా అని చాలామంది నెటిజన్లు ఆమెను తీవ్రంగా విమర్శించారు. అయితే రకుల్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు రాకపోవడానికి కారణం మరొకటి ఉందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.


చెక్ స్క్రిప్ట్ వినిపిస్తున్న సమయంలో సినిమా లో ఎటువంటి పాటలు ఉండవని చంద్రశేఖర్ ఏలేటి రకుల్ ప్రీత్ సింగ్ కి చెప్పారట. కానీ ఆయన ప్రియా ప్రకాష్ వారియర్, నితిన్ తో కొన్ని సాంగ్స్ రూపొందించారు. దీనితో తనకు ఈ విషయం గురించి ముందే ఎందుకు చెప్పలేదని.. తనకు అబద్దం చెప్పి మోసం చేశారని ఆమె చంద్రశేఖర్ ఏలేటి తో కాస్త కోపంగా వాదించారంట. ఈ కారణంతోనే ఆమె సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని సమాచారం.


ఇకపోతే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చెక్ సినిమాలో నితిన్ ఒక ఖైదీగా, రకుల్ ప్రీత్ సింగ్ లాయర్ గా, ప్రియా ప్రకాష్ వారియర్ ఫ్లాష్ బ్యాక్ లో నితిన్ ప్రేమికురాలిగా కనిపించనున్నారు. జైల్లో ఆద్యంతం ఆసక్తిగా కొనసాగే ఈ చెక్ సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో తెలియాలంటే కొద్ది గంటలు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: