తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో హీరో అజిత్‌ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు ఏ హీరో. అయితే మాస్ హీరోగా అభిమానులు అలరించే సినిమాలు చేస్తూ బీభత్సమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు ఆయన. అయితే కెరీర్ తొలినాళ్లలో అజిత్ ఎన్నో ప్రేమకథా చిత్రాలతో లవర్ బాయ్ ఇమేజ్ ని కైవసం చేసుకున్నారు. తెలుగులోకి డబ్ అయిన ‘ప్రేమలేఖ’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆహ్వానం, లిటిల్ సోల్జర్స్, ఆవిడా మా ఆవిడే, రాణా, పెద్ద మనుషులు, అల్లుడుగారు వచ్చారు లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో.

ఇక ఇప్పుడు అజిత్ నటించిన అన్ని సినిమాలో తెలుగులోకూడా డబ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. తల’ అజిత్ కుమార్ లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల అజిత్ హైదరాబాద్‌లో కెమెరా కంట పడ్డారు. క్లీన్ షేవ్‌తో సరికొత్తగా ఉన్న తల పిక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. అజిత్ కు హైద‌రాబాద్‌తో ఎంతో అనుబంధం ఉంద‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అజిత్ హైద‌రాబాద్‌లోనే పుట్టి పెరిగాడు. హీరో కాకముందు హైదరాబాద్ లోనే బైక్ మెకానిక్ గా ప‌నిచేశాడు. త‌న‌కు వీలు దొరికిన‌ప్పుడ‌ల్లా హైద‌రాబాద్‌కు వ‌చ్చి వెళ్తుంటాడు.

అయితే ఇటీవల బైక్ వేసుకొని దేశంలోని ముఖ్యమైన ప్రాంతాలను చుట్టేసి వచ్చాడు అజిత్. ఈ జర్నీలో కంటిన్యూస్ గా 10 వేల కిలోమీటర్లు తిరిగేసి వచ్చాడు. తాజాగా.. హైదరాబాద్ లో రోడ్డుపై సైక్లింగ్ చేశాడు అజిత్. శంషాబాద్ విమానాశ్రయం నుండి మెహదీపట్నం వరకు తిరిగి అరమ్ఘర్ చౌరాస్తా మీదుగా రామోజీ ఫిలిం సిటీ వరకు సైకిల్ తొక్కాడు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో అజిత్ లేటెస్ట్ మూవీ ‘వాలిమై’ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఎవ‌రూ గుర్తు ప‌ట్ట‌కుండా ఉండేలా బ్లాక్ ఔట్‌ఫిట్‌లో ఉన్న అజిత్ ఫేస్‌ను క‌వ‌ర్ చేస్తూ..సైక్లింగ్ చేశాడు. అయితే అజిత్ తో రైడ్ చేసిన వ్య‌క్తులు తీసిన‌ ఫొటోలు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: