తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనతో కోట్లాది మంది అప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక అన్నయ్య అనే టైటిల్ చిరంజీవి నటించిన పాత సూపర్ హిట్ సినిమా పేరు తెలిసిందే. తాజాగా ఈ సినిమా మూవీ మేకర్స్ ఈ సినిమాకు ‘పెద్దన్నయ్య’ అనే టైటిల్ పెడితే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారట.పెద్దన్నయ్య టైటిల్ గతంలో బాలకృష్ణ హీరోగా నటించిన పాత సూపర్ హిట్ మూవీ.

అయితే రజినీకాంత్..  ‘అన్నాతే’ సినిమాలో నలుగురు తమ్ముళ్లకు అన్నయ్యగా నటిస్తున్నాడు. కాబట్టి ఈ సినిమాకు తెలుగులో ‘పెద్దన్నయ్య’ టైటిల్ పెడితే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నాడట. మొత్తానికి రజినీకాంత్ తెలుగు డబ్బింగ్ వెర్షన్‌కు చిరంజీవి టైటిల్ పెట్టాలా లేకపోతే బాలకృష్ణ సినిమా టైటిల్ పెట్టాలా అనే విషయమై తర్ణన భర్జనలు నడుస్తున్నాయి.

ఇక ఫైనల్‌గా రజినీకాంత్ తెలుగులో విడుదలయ్యే తన సినిమాకు ఏ టైటిల్ ఫిక్స్ చేస్తాడా అని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో రజినీకాంత్ సరసన సీనియర్ హీరోయిన్స్ ఖుష్బూ, మీనా నటిస్తున్నారు. ఈ సినిమాను ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం దీపావళికి విడుదల చేయాలనుకన్నారు. కానీ కరోనాతో పాటు రజినీకాంత్ ఆరోగ్య కారణాల రీత్యా ఈ సినిమా మరింత ఆలస్యం కానుందని సమాచారం.

అంతేకాదు హీరోగా రజినీకాంత్సినిమా తర్వాత రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం రజినీకాంత్ ఆరోగ్యం ఏమంత సహకరించడం లేదు. ఈ సినిమాను ఎలాగో అలా కంప్లీట్ చేసి పూర్తిగా రెస్ట్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు రజినీకాంత్. అందుకే పార్టీ ప్రకటిస్తానని చెప్పి.. హెల్త్ ఇష్యూస్ కారణంగా అసలు రాజకీయాల్లోకి రావడం లేదంటూ ప్రకటించారు. మొత్తంగా హీరోగా రజినీకాంత్‌కు ఇది చివరి సినిమా అనే టాక్ తమిళ సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. మరి ఈ మ్యాటర్‌కు రజినీకాంత్ ఎలా చెక్ పెడతాడనేది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: