అల్లరి మూవీతో చిత్రసీమలోకి హీరోగా అడుగుపెట్టిన నరేష్.. తన మొదటి సినిమానే తనపేరుగా మార్చుకున్నాడు. అల్లరి సినిమాతో అల్లరి నరేష్ అనిపించుకున్న నరేష్.. ఆ తర్వాత వరుస కామెడీ చిత్రాలు చేస్తూ ప్రేక్షకుల్లో మరో రాజేంద్ర ప్రసాద్ అనిపించుకున్నాడు. నరేష్ నుండి సినిమా వస్తుందంటే కామెడీ కితకితలు కన్ ఫర్మ్ అని ఫిక్స్ అయ్యారు. అల్లరి నుండి సుడిగాడు వరకు ఎన్నో చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఫలితాలు రాబట్టాయి. సుడిగాడు తర్వాత నరేష్ కు ఒక్క హిట్ పడలేదు సరికదా. .కనీసం పబ్లిసిటీ ఖర్చుల అంత కూడా తెచ్చుకోలేకపోయాయి. ఒకానొక టైములో నరేష్ సినిమాలు మానేస్తే బెటర్ అనే కామెంట్స్ కూడా వినిపించాయి. ఈ క్రమంలో నాంది సినిమా మళ్లీ నరేష్ కు ఊపిరి పోసింది.

విజ‌య్ క‌న‌క‌మేడ‌ల‌ డైరెక్షన్లో ప్రముఖ డైరెక్టర్ స‌తీష్ వేగేశ్న‌ నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీ గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ విజయం సాధించింది. మొదటి రోజు మొదటి షో తోనే హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు , విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దీంతో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతుంది. మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ లో చేరి డిస్ట్రిబ్యూటర్స్ కు లాభాలు తెచ్చిపెట్టింది. ఇక ఇప్పుడు ఈ సినిమా రైట్స్ కు విపరీతమైన డిమాండ్ వస్తుంది.

ఇప్పటికే ఈ మూవీ రీమేక్ రైట్స్ ను రెండున్నర కోట్లకు సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ , డిస్ట్రబ్యూటర్ దిల్ రాజు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇక ఇప్పుడు డిజిటల్ రైట్స్ ను ఆహా కొనుగోలు చేయడం విశేషం. 2.25 కోట్లకు డిజిటల్ హక్కులను ఆహా సొంతం చేసుకుంది. మార్చి రెండో వారంలో దీనిని స్ట్రీమింగ్ చేయాలని ఆహా టీం భావిస్తుంది. మొత్తం మీద నాంది మూవీ అటు నరేష్ కు, ఇటు నిర్మాతలకు పంట పండించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: