సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్త సింగర్లు పుట్టుకొస్తూనే వుంటారు. అంతేకాకుండా సరికొత్తగా మన స్టార్ హీరోలు కూడా పాటలు పాడి అందరిని మెస్మరైజ్ చేస్తూ ఉంటారు.. మరీ ముఖ్యంగా మన టాలీవుడ్ హీరోలకు టాలెంట్ ఎక్కువ. వారు కేవలం యాక్షన్, కామెడీ, హీరోయిజం పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా వారు తమ సొంత వాయిస్ తో పాటలు పాడి, ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకున్నారు. అలా అభిమానులకు వారి పాటతో దగ్గరయ్యారు .. అసలు మన స్టార్స్ పాడిన పాటలు ఏంటో..? ఆ స్టార్స్ ఎవరో..? ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం...


పవన్ కళ్యాణ్ :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనగానే చాలు అభిమానులలో ఎక్కడ లేని ఊపు వచ్చేస్తుంది.. అంతేకాదు తన నటనతో  ప్రేక్షకులకు బాగా  దగ్గరైన పవన్ కళ్యాణ్, తన పాటలతో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు . పంజా  సినిమాలో ఒక పాట కూడా పాడారు. అలాగే అత్తారింటికి దారేది, కాటమరాయుడు సినిమాల్లో కూడా పాటలు పాడి బాగా హిట్ ని సంపాదించాడు.


చిరంజీవి:
మెగాస్టార్ చిరంజీవి కూడా తన పాటతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు "తమ్ముడు ఆరె తమ్ముడు" అనే పాటతో పాటు మృగరాజు సినిమాలో " యే ఛాయ్ " అనే పాటను కూడా పాడారు.


మహేష్ బాబు :
మహేష్ బాబు కూడా బిజినెస్ మాన్ లో ఒక పాట పాడారు.. ఈ పాటకు తమన్ సంగీతం అందించగా, మహేష్ బాబు తన పాటతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు..

కమల హాసన్ :
కమల్ హాసన్ విశ్వరూపం సినిమాలో రెండు పాటలు పాడాడు.


నిఖిల్ :
నిఖిల్ స్వామి రారా చిత్రంలో ఒక పాట పాడి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా ఆ పాటకు యూత్ అంతా ఫిదా అయిపోయారు.

రవితేజ :
పవర్ సినిమాలో "నోటంకి నోటంకి" అనే పాటను స్వయంగా రవితేజ పాడారు.


ఇక వీరే కాకుండా ఎన్టీఆర్, నాగార్జున, విక్టరీ వెంకటేష్, బాలకృష్ణ  వీరందరూ కూడా కొన్ని సినిమాలలో  స్వయంగా పాటలు పాడి, ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు .

మరింత సమాచారం తెలుసుకోండి: