
ఈ క్రమంలోనే సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ షోలో కూడా గెస్ట్లుగా ఎంట్రీ ఇచ్చిన వారితో వివిధ రకాల టాస్క్ లు చేయిస్తూ వారితో ఒక ఆట ఆడుకుంటుంది అన్న విషయం తెలుస్తుంది. కొన్ని రకాల ఫన్నీ ఫన్నీ టాస్క్ ల తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. అయితే ఇటీవలే వచ్చేవారం క్యాష్ ప్రోగ్రాం కి సంబంధించిన ప్రోమో విడుదల సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ప్రస్తుతం ఈ ప్రోమో కాస్త బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఈ సారి ప్రోమోలో భాగంగా బుల్లితెరపై సీరియల్స్ ద్వారా అలరిస్తున్న నటీమణులు గెస్ట్ లుగా వచ్చారు.
ఇక ఈ క్రమంలోనే వారితో వివిధ రకాల టాస్కులు చేయిస్తూ సుమ సరికొత్త ఎంటర్టైన్మెంట్ పంచింది. ఇక ఇప్పుడు ప్రోమోలో భాగంగా ఒకటాస్క్ చేస్తున్న సమయంలో.. నటి చెప్పిన ఆన్సర్ కి సుమ ఒక్కసారిగా అవాక్కయ్యింది సుమా. సుమ ఇద్దరు నటీనటులను పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో.. స్కిట్ లో భాగంగా పక్కనే ఉన్న అసిస్టెంట్ తో మాట్లాడుతూ ఉంటుంది సుమా. దీంతోపక్కనే ఉన్న నటి స్పందిస్తూ.. ఏంటి ఈ లొట్టపీసు పంచాయతీ అంటూ రిప్లై ఇస్తుంది దీంతో అందరూ పగలబడి నవ్వుకుంటారు. అయితే ఆ నటి ఇలా అనడం తో సుమా కూడా షాక్ అవుతారు.