సుకుమార్ సినిమా షూటింగ్ కొద్దిగా నెమ్మదిగానే జరుగుతుంది. రిలీజ్ డేట్ ప్రకటించిన తర్వాత స్పీడ్ గా అనుకున్న షెడ్యూల్ కాస్త స్లో అవుతుందట. దీనితో బన్నీ ఎట్టిపరిస్థితుల్లో రిలీజ్ అనుకున్న టైం కు సినిమా పూర్తి చేయాలని ప్రెజర్ చేస్తున్నాడని టాక్. సుకుమార్, బన్నీ ఇద్దరికి మంచి అండర్ స్టాండింగ్ ఉంది. వారు అనుకున్న అవుట్ పుట్ రాకపోతే రిలీజ్ డేట్ కూడా మార్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అల వైకుంఠపురములో సక్సెస్ తర్వాత బన్నీ పుష్ప మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు.
ఈ సినిమాతో బన్నీ నేషనల్ లెవల్ లో తన సత్తా చాటనున్నాడు. తప్పకుండా అల్లు అర్జున్ స్టామినా ఏంటన్నది ఈ సినిమాతో ప్రూవ్ అవుతుంది. పుష్ప తర్వాత అల్లు అర్జున్ కొరటాల శివ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని కూడా పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. కొరటాల శివ మూవీ కూడా భారీ రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది. చూస్తుంటే ప్రభాస్ తర్వాత చేస్తే పాన్ ఇండియా సినిమా అనేలా అల్లు అర్జున్ సత్తా చాటేలా ఉన్నాడు.