కీర్తి సురేష్ హీరోయిన్ గా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మీద యూత్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఇప్పటికే మంచి పబ్లిసిటీ కూడా వచ్చేసింది. ఇక మేర్లపాక గాంధీ దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్ హిట్ అయిన 'అంధాధూన్' రీమేక్ లో నటిస్తున్నారు.. సినిమా లో హీరో ఒక బ్లైండ్ కాగా ఈ పాత్రకు నితిన్ ఒప్పుకోవడం పెద్ద రిస్క్ అయితే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను తమన్నా ఒప్పుకోవడం ఇంకా పెద్ద రిస్క్.. ఇదిలా ఉంటే నితిన్ విజయ్ దేవరకొండ ని ఫాలో అవుతున్నాడు..
విజయ్ దేవరకొండ ఓ లవ్ స్టోరీ సినిమా చేసి అది ఆడక పోవడంతో ఇకపై లవ్ స్టోరీ సినిమాలు చేయొద్దని నిర్ణయించుకున్న విషయాలు తెలిసిందే.. అలానే నితిన్ కూడా రంగ్ దే తర్వాత ఆ తరహా సినిమాలు చేయొద్దని నిర్ణయించుకున్నాడట. నితిన్ కెరీర్ మొదటినుంచి చూస్తే ఇదే కనిపిస్తుంది.. ఆయన ఎక్కువగా లవర్ స్టోరీ లతోనే హిట్ లుకొట్టాడు. యాక్షన్ సినిమాలు చేసిన ప్రతి సారి బోల్తా పడ్డాడు.. మరి నితిన్ తీసుకున్న ఈ నిర్ణయం ఎంత వరకు కరెక్టో వేచి చూడడం...