కన్నడ స్టార్
హీరో యష్ కేజీఎఫ్ సినిమాతో పాన్
ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఈ
సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు
ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లోనే
కేజీఎఫ్ 2ను భారీగా ప్లాన్ చేసి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అంతే కాకుండా సినిమాలో వివిధ
ఇండస్ట్రీ ల నుండి ప్రముఖ నటులను భాగం చేశారు. దాంతో ఈ
సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ
సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసి విడుదలకు సిద్ధమవుతోంది. కాగా ఈ చిత్రం విడుదల కాకుండానే
ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ సినిమాను మొదలు పెట్టాడు. ఈ
సినిమా కూడా
కేజీఎఫ్ లాంటి కథే అని వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పటికే
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సలార్ అంటే
కమాండర్ అని..ఒక గ్రూప్ లో కుడి భుజంగా ఉండేవాడు
లీడర్ గా ఎదుగుతాడని అన్నారు. ఇక
కేజీఎఫ్ కూడా ఇలాటి కథే ఒక చిన్నపాటి
గ్యాంగ్ స్టర్ కోల్ మైన్ కు
కింగ్ గా ఎదుగుతారు.
అయితే తాజాగా ఈ సలార్ కథపై మరి కొన్ని వార్తలు వస్తున్నాయి.
కేజీఎఫ్ స్టోరీ చెప్పినప్పుడే
ప్రశాంత్ నీల్ యష్ కు సలార్ కథ కూడా చెప్పాడట. అయితే
యష్ కేజీఎఫ్ కథలో నటించడానికి ఒకే చెప్పాడట. దాంతో ఆ కథను పక్కన పెట్టేసి
కేజీఎఫ్ తో రికార్డులు బద్దలు కొట్టే తీసే
సినిమా తీసాడు. ఇక అప్పుడు
యష్ పక్కన పెట్టిన కథను
ప్రభాస్ కు చెప్పగా ఆయన ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. అయితే
యష్ రేంజ్ వేరు
ప్రభాస్ రేంజ్ వేరు.
ప్రభాస్ ఇప్పటికే
బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు. కాబట్టి
ప్రభాస్ రేంజ్ కు తగ్గట్టుగా
ప్రశాంత్ నీల్ కథలో కొన్ని మార్పులు చేశారట. మరి
యష్ పక్కన పెట్టిన కథతో
ప్రభాస్ ఎలాంటి విజయం సాధిస్తాడా చూడాలి.