పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరే ఒక ప్రభంజనం. యువతకు వంద రెట్లు ఉత్సాహాన్నిచ్చే పలుకు పవర్ స్టార్. మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన ఈ హీరో అన్నకు తగ్గ తమ్ముడుగా ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదిగారు. తన నటనతో అభిమానుల సైన్యాన్ని పెంచుకున్నారు. అయితే ఉన్నట్టుండి ఈ అగ్రహీరో సినిమాలు చేయడం ఆపేసి... రాజకీయ రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. అయితే దాదాపు మూడేళ్ళ తర్వాత ఇటీవలే మళ్లీ సినీ ఇండస్ట్రీలోకి తిరిగి రీ-ఎంట్రీ ఇచ్చారు పవర్ స్టార్. ప్రస్తుతం ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు.

ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతున్నారు పవన్. అయితే రాజకీయాల్లోకి అడుగు పెట్టాక విమర్శ, ప్రతి విమర్శలు తప్పనిసరి. అదే విధంగా రాజకీయ పరంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూనే సంకల్పబలంతో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ని టార్గెట్ చేస్తున్న ప్రధాన అంశం ఆయన చేసుకున్న 3 పెళ్లిళ్లు. ముఖ్యంగా ఈ విషయంపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. ఇవన్నీ పక్కన పెడితే
పవన్ కళ్యాణ్ 1995లో విశాఖకు చెందిన నందిని అనే ఆమెను మెుదటిగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య వివాదాలు తలెత్తడంతో.. చివరికి 2008లో నందిని నుంచి విడాకులు తీసుకున్నారు పవన్.

ఆ తర్వాత ఆయన బద్రి సినిమాలో తనతో కలసి నటించిన రేణు దేశాయ్ ని ప్రేమించి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.. వీరికి ఇద్దరు పిల్లలు. ఆ తర్వాత వీరిద్దరూ కూడా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ర‌ష్యన్ న‌టి అన్నా లెజినోవాని వివాహం చేసుకున్నారు పవన్. వీరికి ఇద్దరు పిల్లలు. మొదటి భార్య నందిని.. పవన్ తో  విడాకుల అనంతరం, ఈమె తన పేరును జాహ్నవిగా మార్చుకుని 2010 లో డాక్టర్ కృష్ణా రెడ్డి అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం నందిని అలియాస్ జాహ్నవి అమెరికాలో ఉంటున్నట్లు సమాచారం. ఇక పవన్ తో విడిపోయిన తర్వాత రేణుదేశాయ్ ప్రస్తుతం పూణే లో ఉంటూ పిల్లల్ని చూసుకుంటూనే... మరోవైపు పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: