అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మ్యాట్రెస్ కంపెనీ కి సంబంధించిన ఒక వాణిజ్య ప్రకటనలో మహేష్ బాబు, తమన్నా కలిసి నటించనున్నారని తెలుస్తోంది. బెడ్ షీట్, పరుపు కంపెనీ యొక్క రొమాంటిక్ అడ్వర్టైజ్మెంట్ లో మహేష్ బాబు, తమన్నా భాటియా కలసి రొమాన్స్ చేయనున్నారని సినీ వర్గాల సమాచారం. దీంతో ఈ ప్రకటన ఎలా ఉండబోతోందోనని అభిమానులు ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ యాడ్ షూట్ జరగనుందని సమాచారం.
సినిమా కెరీర్ పరంగా చూసుకుంటే.. మహేష్ బాబు కీర్తి సురేష్ తో కలిసి సర్కారు వారి పాట సినిమా చేస్తున్నారు. బ్యాంకు స్కామ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి పరశురాం దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ రావిపూడితో కలిసి మరొక సినిమా చేయడానికి మహేష్ బాబు అంగీకరించారని సమాచారం అందుతోంది. ఈ సినిమా షూటింగు సెప్టెంబర్ నెలలో ప్రారంభం కానున్నదని కూడా టాక్ వినపడుతోంది. ఇక దర్శకుడు రాజమౌళితో కూడా మహేష్ బాబు ఒక యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేయనున్నారు. ఇకపోతే తన అందచందాలతో 16 సంవత్సరాల పాటు అభిమానులు ఎంతగానో అలరిస్తున్న తమన్నా భాటియా ప్రస్తుతం సత్యదేవ తో కలిసి కన్నడ మూవీ అయిన "లవ్ మాకటైల్" కి తెలుగు రీమేక్ లో నటిస్తున్నారు.