రష్మీ .. రష్మీ గౌతమ్ ఈ పేరు వింటే ఏదో తెలియని మైకం కమ్మేస్తుంది తెలుగు సినీ ప్రేక్షకులకు. ఇటు బుల్లితెరను, అటు వెండితెరను తన అందం చందం తో   ఈ ముద్దుగుమ్మ. బుల్లితెరపై రష్మీ గౌతమ్ ఎక్స్‌ట్రా జబర్ధస్త్‌, ఢీ షోలతో రచ్చ చేస్తూనే అడపా దడపా సినిమాలు చేస్తూ అందాలను కనువిందు చేస్తూ విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది.రష్మీ తరచు హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ యూత్‌కు కంటిపై కునుకు లేకుండా చేస్తుంటుంది.తాజాగా రష్మీ షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

రష్మి గౌతమ్ కి బుల్లితెరపై వచ్చిన క్రేజ్ వెండితెరపై రాకపోయినా అదృష్టం పరీక్షించుకుంటూ విభిన్న పాత్రలు పోషిస్తూ వస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్ తన సోషల్ మీడియా అభిమానులకు పంచుకుంటుంది. ప్రస్తుతం వెండితెరపై ఆచితూచి పాత్రలు ఎంచుకుంటున్న రష్మీ గౌతమ్ "బొమ్మ బ్లాక్‌బస్టర్" అనే సినిమాలో నటిస్తోంది.ఈ సినిమా నుంచి ఆమె ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు మేకర్స్.ప్రస్తుతం "బొమ్మ బ్లాక్‌బస్టర్" మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.  త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ మూవీలో యువ హిరో నందు ఆనంద్ కృష్ణ,  యాంకర్ ర‌ష్మీ గౌత‌మ్ హీరోహీరోయిన్లుగా విజ‌యీభ‌వ ఆర్ట్స్ ప‌తాకంపై నూతన దర్శకుడు రాజ్ విరాఠ్ దర్శకత్వంలో కామెడీ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ రూపొందుతోంది. ఇటీవలే ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

రష్మీ వీలున్నప్పుడల్లా ఫోటోషూట్‌లు చేస్తూ  కుర్రకారు మతిపోయేలా చేస్తోంది.తాజాగా రష్మీ షేర్ చేసిన రెడ్ శారీ ఫోటోలతో సోషల్ మీడియా షేక్ అవుతోంది.తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ ఇండస్ట్రీలో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది. రష్మీ చేసే ప్రతి ఫోటో షూట్ కి ప్రశంసలు, విమర్శలు అనేవి చాలా కామన్. అందుకే ఇవేమి పట్టించోకుండా తెలుగు ఇండస్ట్రీలో దూసుకుపోతోంది ఈ బ్యూటీ క్వీన్

మరింత సమాచారం తెలుసుకోండి: