ప్రభాస్ నటిస్తున్న తాజా సినిమా రాధేశ్యామ్ పై ఆయన ఫ్యాన్స్ లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. గోపి కృష్ణ మూవీస్, యు.వి.క్రియేషన్స్ సంస్థల పై నిర్మితమవుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా జస్టిన్ ప్రభాకరన్ సౌత్ వెర్షన్స్ కి మ్యూజిక్ అందిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ గా ఎంతో భారీ వ్యయంతో అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. కొన్నేళ్ల క్రితం యూరప్ లో జరిగిన ఒక యదార్థ ప్రేమ కథ ని కొంత మార్చి దానికి పలు కమర్షియల్ రంగులద్ది దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని అంటున్నారు.

కృష్ణంరాజు, భాగ్యశ్రీ, ప్రియదర్శి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవల రిలీజ్ అయి అందరి నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక ఈ సినిమాకు ఇప్పటికే నుంచి భారీ స్థాయి బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయని ముఖ్యంగా నార్త్ లో అయితే ఊహించని విధంగా బయ్యర్లు  రాధేశ్యాం రైట్స్ కోసం ఎగబడుతున్నారు అని అంటున్నారు. 

ఇక అసలు విషయం ఏమిటంటే ఈ సినిమా లో ప్రభాస్, పూజా ఇద్దరూ వాడిన కాస్ట్యూమ్స్ ని కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఎందరో ప్రఖ్యాత డిజైనర్లతో తయారు చేయించారని, అలానే పలువురు హాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన డిజైనర్లు ఈ మూవీకి పనిచేసినట్లు చేతున్నారు. అయితే కేవలం హీరో హీరోయిన్స్ ఇద్దరూ మాత్రమే కాకుండా ఇతర పాత్రధారులు ధరించిన దుస్తుల తో పాటు సినిమా కోసం వేసిన ప్రత్యేకమైన సెట్స్ కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయని టాక్. నిజానికి బాహుబలి తర్వాత ప్రభాస్ కి అన్ని వర్గాల ఆడియన్స్ లో ఎంతో పేరు రావడంతో ఆయన నుండి అభిమానులు ఆశించే అన్ని రకాల అంశాలు ఈ మూవీలో ఉంటాయని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త నిజమే అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇది మంచి పండుగ న్యూస్ అని చెప్పాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: