ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఛాన్స్ రావడం అనేది ఆశామాషీ వ్యవహారం కాదు.. హీరోయిన్ స్థానం కోసం ఇండ్రస్టీ లో ఎంతమంది పోటీ పడుతున్నారు.. అయితే కొంతమంది కేవలం ఒక్క సినిమాతోనే స్టార్ అయిపోతూ ఉంటారు.. అలా హీరోయిన్ గా కొందరికి రాత్రికి రాత్రే స్టార్ డమ్ వచ్చేస్తే, కొందరు ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండదు. దాంతో ఇండస్ట్రీకి దూరమై పోతారు. అలా ఇండస్ట్రీకి దూరం జరిగిన వారిలో ముంబై బ్యూటీ రూబీ పరిహార్ ఒకరు. ఈమె ప్రస్తుతం ముంబై లో నివాసముంటోంది. తెలుగులో ప్రముఖ దర్శకుడు దేవ కట్టా తెరకెక్కించిన ప్రస్థానం అనే సినిమాలో యంగ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ సరసన హీరోయిన్టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది రూబీ పరిహార్..

సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది..ఇక సినిమా అనంతరం రూబీ.. తెలుగు, కన్నడ, హిందీ, తదితర భాషలలో దాదాపుగా 8కి పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.ఇందులో ప్రస్థానం, గబ్బర్ ఈస్ బ్యాక్ తదితర చిత్రాలు తప్ప మిగిలిన మూవీస్ అంతంత మాత్రమే. ఇక తెలుగులో హీరోయిన్ గా నటించిన చిత్రాల కథల విషయంలో అవగాహన లేకపోవడం కారణంగానే చాలా మూవీస్ డిజాస్టరయ్యాయి.కొన్ని మూవీస్ అయితే ఎప్పుడు విడుదలయ్యాయో కూడా తెలియదు.

ఇండస్ట్రీలో ఎలాగైనా పాగా వేయాలని కష్టపడినా ఛాన్స్ లు లేక, ముంబైకి చెక్కేసిన ఈమె బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన "గబ్బర్ ఈస్ బ్యాక్" అనే చిత్రంలో ఓ చిన్న పాత్రలో మెరిసింది.దురదృష్టం కొద్దీ ఈ చిత్రం కూడా ఈ భామకు కలిసి రాకపోవడంతో ప్రస్తుతం మోడలింగ్ రంగంలో ఉందని టాక్. అయితే ఇటీవలే రూబీ పరిహార్ బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ వ్యక్తితో ప్రేమలో పడిందని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతు న్నట్లు వార్తలు వచ్చినా కూడా రూబీ పరిహార్ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు..దీంతో ఈ వార్తలు నిజమేనని పలు మీడియా మాధ్యమాలు తెలిపాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: