కరోనా సమస్యలు వల్ల ఓటీటీ లోకి వస్తుంది అనుకున్న ‘వైల్డ్ డాగ్’ మూవీని ఇప్పుడు డైరెక్ట్ గా ధియేటర్ల లో విడుదల చేస్తున్నారు. సంక్రాంతి నుండి విడుదల అవుతున్న సినిమాలకు ప్రేక్షకుల నుండి వస్తున్న స్పందనను చూసి నాగ్ తన మనసు మార్చుకుని తాను కూడ సమ్మర్ రేస్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.


ఈమూవీకి సంబంధించిన ట్రైలర్ చిరంజీవి చేతులు మీదగా విడుదల అయిన తరువాత ఈ ట్రైలర్ పై కొన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఈ ట్రైలర్ లోని సీన్స్ చూసిన వారికి ఈమూవీలోని సీన్స్ వెబ్ సిరీస్ లోని సీన్స్ చూసినట్లుగా అనిపిస్తోంది కాని కమర్షియల్ మూవీగా అనిపించడం లేదు అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఈమూవీలోని సీన్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ పరిశీలించిన వారు ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ పోలికలతో కనిపిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


ఇలాంటి సినిమాల కథలను వెబ్ సిరీస్ లో బాగా చూస్తారు కాని ధియేటర్లలో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారా అంటూ మరికొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. ఇది ఇలా ఉంటే ‘వైల్డ్ డాగ్’ మూవీ ట్రైలర్ గురించి చిరంజీవి నాగార్జున కలిసి మాట్లాడుకున్న విషయాలను నాగార్జున బయటపెట్టాడు.‘వైల్డ్ డాగ్’ ట్రైలర్ చూసిన మహేష్ బాబు ఈ ట్రైలర్ బాగుంది అంటూ కామెంట్ చేయగానే చిరంజీవి తన వాట్సాప్ లో మహేష్ కు రిప్లయ్ ఇస్తూ అతడి అభిప్రాయంతో ఏకీభవించాడు. దీనితో వీరిద్దరి అనుమతితో నాగార్జున ఆ స్క్రీన్ షాట్స్ ను నాగార్జున బయటపెట్టాడు.


ఇలా హీరోల మధ్య మరొక హీరో సినిమా ట్రైలర్ గురించి వారిలో వారు మాట్లాడుకుని షేర్ చేసుకునే అభిప్రాయాలను బయటపెట్టే కల్చర్ పద్ధతి నాగ్ క్రియేట్ చేసాడు. 60 సంవత్సరాలు దాటిపోయినా నాగార్జున తాను ఇప్పటికీ యంగ్ అంటూ యాక్షన్ మోడ్ లోకి మారిపోయాడు. దీనికితోడు ఈమూవీలోని అతడి లుక్ కూడ బాగుంది హాలీవుడ్ హీరోల రేంజ్ లో ఉంది. అయితే ఇలాంటి యాక్షన్ సినిమాలను ఇప్పటికే చాల చూసిన ప్రేక్షకులు ఎంతవరకు నాగ్ ప్రయత్నైకి స్పందిస్తారు అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న..

మరింత సమాచారం తెలుసుకోండి: