అయితే ఇప్పటికే దిల్‌రాజుకు నైజాం ఏరియా నుంచి వరంగల్ శ్రీను గట్టిపోటీనిస్తున్నాడు. సాధారణంగా దిల్‌రాజు చేతికి వెళ్లాల్సిన కొన్ని స్టార్ హీరోల ప్రాజెక్టుల నైజాం ఏరియా హక్కులన్నీ వరంగల్ శ్రీను దక్కించుకున్నాడు. పోనీ వరంగల్ శ్రీను కదా.. ఎలాగో చూసుకుందాంలే అని దిల్‌రాజు అనుకుంటే ఇప్పుడు దిల్‌రాజుకు మరో డిస్ట్రిబ్యూటర్ నుంచి పోటీ ఎదురవుతుంది. ఇంతకీ ఆ డిస్ట్రిబ్యూటర్ ఎవరో కాదు.. లక్ష్మణ్. ఈయనెవరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు దిల్‌రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ముగ్గురు నిర్మాతల్లో ఒకరు. ఏదో విబేదాల కారణంగా ఎస్‌వీసీ బ్యానర్ నుంచి బయటకు వచ్చి సొంత డిస్ట్రిబ్యూషన్ హౌస్‌ను స్టార్ట్ చేశాడు లక్ష్మణ్.
ఇక తొలి సినిమాగా రీసెంట్‌గా విడుదలైన జాతిరత్నాలు సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశాడు లక్ష్మణ్. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో లక్ష్మణ్ ఇప్పుడు మరిన్ని క్రేజీ ప్రాజెక్టులను కూడా దక్కించుకున్నాడట. ఈ సినిమాలు కూడా హిట్ అయితే ఇక లక్ష్మణ్‌కు తిరుగుండదు అని సినీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తలు. ఒక వైపు వరంగల్ శ్రీను, మరో వైపు లక్ష్మణ్ దిల్‌రాజుని డైరెక్ట్‌గానో, ఇన్‌డైరెక్ట్‌గానో ఇబ్బంది పెడుతున్నవారే.