స్టార్ హీరో శర్వానంద్ స్క్రిప్ట్ ఎంపిక విషయంలో బాగా ఫెయిల్ అవుతున్నారు. రిజెక్టెడ్ స్క్రిప్ట్ లను ఎంపిక చేసుకొని వరుసగా డిజాస్టర్లను చవిచూస్తున్నారు. జాను సినిమా ముందుగా నాని వద్దకు వచ్చింది కానీ అతను ఆ సినిమాని రిజెక్ట్ చేశారు. దిల్ రాజు జాను స్క్రిప్ట్ ని శర్వానంద్ వద్దకు తీసుకెళ్లగా ఆయన వెంటనే అంగీకరించి ఆ సినిమా చేశారు. కానీ అది బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో శర్వానంద్ కి కెరీర్ పరంగా నష్టాలు వాటిల్లాయి. దిల్ రోజు ని నమ్మి ఆయన ఈ సినిమా చేయడానికి అంగీకరించారు కానీ అనూహ్యంగా అది డిజాస్టర్ కావడంతో ఆయన షాక్ అయ్యారు.


ఇక ఇటీవల శర్వానంద్ శ్రీకారం సినిమాలో నటించారు. ఈ సినిమా మెసేజ్ ఓరియంటెడ్ గా తెరకెక్కి మంచి రెస్పాన్స్ ని సంపాదించింది కానీ కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. దీంతో మళ్లీ శర్వానంద్ ఖాతాలో డిజాస్టర్ చేరిపోయింది. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ ని కూడా ముందస్తుగా హీరో నాని వద్దకు తీసుకు వెళ్లారట. స్క్రిప్ట్ బాగుంది కానీ కమర్షియల్ గా వర్కవుట్ కాదని నాని సినిమా నుంచి మెల్లగా జారుకున్నారు. అయితే శర్వానంద్ మాత్రం ఈ సినిమా కథ వినగానే వెంటనే ఓకే చెప్పి తెరకెక్కించారు. ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించడానికి కూడా ఎటువంటి అవకాశం లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. ఈ సినిమాకి అంతగా ప్రచారం చేయలేదనే టాక్ కూడా ఉంది. మరోవైపు జాతిరత్నాలు వంటి ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ బరిలోకి దిగడంతో శ్రీకారం సినిమాని చూసేందుకు ఎవరూ వెళ్లడం లేదు.


అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహాసముద్రం సినిమా కథ కూడా ముందుగా శర్వానంద్ వద్దకు రాలేదు. ఈ సినిమా కథను ముందస్తుగా రవితేజకి వినిపించారు కానీ ఆయన నో చెప్పారు. శర్వానంద్ మాత్రం యధావిధిగా మరో హీరో రిజెక్ట్ చేసిన కథను మెచ్చి మహా సముద్రం సినిమా చేస్తున్నారు. నిజానికి రిజెక్ట్ చేసిన కథలలో నటించడం తప్పేమీ కాదు కానీ అవి తనకి సెట్ అవుతాయా కాదా అనే విషయం తెలుసుకోవాలి. ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమా స్క్రిప్ట్ ని మొదటిగా హీరో వెంకటేష్ కి వినిపించారు కానీ ఆయన ఏవో కారణాల వల్ల దీన్ని రిజెక్ట్ చేశారు. ఆ సినిమాలో నటించడానికి కూడా శర్వానంద్ ఒకే చెప్పడం విశేషం. ఇలా చూస్తుంటే అన్నీ రిజెక్ట్ చేసిన కథలనే ఎంచుకుంటూ శర్వానంద్ తమ అభిమానులకు కోపం తెప్పిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆయన ఖాతాలో ఒక్క హిట్ కూడా లేదు దీంతో ఆయన అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: