రామ్ చరణ్ శ్రీనువైట్ల దర్శకత్వంలో నటించబోతున్న లేటెస్ట్ సినిమాలో సమంత బదులు రకుల్ ప్రీత్ ఎంపిక కావడం వెనుక కారణాల పై కొందరు ఊహగానాలు చేస్తూ సమంత కాల్ షీట్స్ సద్దుబాటు కాకపోవడం అని కొందరు అనుకుంటే, ఆ సినిమా బడ్జెట్ తగ్గించడానికి అని మరికొందరు భావించారు. అయితే ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి అసలు విషయాలు బయట పడ్డాయి అని అంటున్నారు.
ఈ సినిమాలో సమంతను హీరోయిన్ గా పెడదామని శ్రీనువైట్ల ఎంత నచ్చ చెప్పినా రామ్ చరణ్ మాత్రం రకుల్ ప్రీత్ కే ఓటు వేశాడని ఫిలింనగర్ టాక్. దీనికి కారణం ఈమధ్య కాలంలో సమoత సినిమాలు టాలీవుడ్ లో పెద్దగా సక్సస్ అందుకొకపోవడంతో సమంత కన్నా రకుల్ ప్రీత్ బెటర్ అని చరణ్ శ్రీనువైట్ల దగ్గర కామెంట్ చేసాడని టాక్.
అయితే ఈ విషయాలు సమంత దాకా వెళ్ళడంతో ఈ మాయలేడి చరణ్ తన క్రేజ్ ను ఇంత తక్కువ అంచనా వేస్తాడా అని తన సన్నిహితుల బాధ పడుతోందట. దానితో చరణ్ కు షాక్ ఇవ్వడానికి ఆమె తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
చరణ్ ఇచ్చిన షాక్ తో తన గ్లామర్ మరింత పెంచు కోవడానికి సమంత ప్రస్తుతం చెన్నైలో తన ఫిట్ నెస్ ను మరింత పెంచుకునే ఉద్దేశ్యంతో ఒక జిమ్ లో ఒక ఫారిన్ ఫిటినెస్ ట్రైనర్ ఆధ్వర్యంలో 95 కేజీలు బరువులు ఎత్తుతూ రోజు విడిచి రోజు జిమ్ లో గడుపుతోంది అని టాక్. ఏమైనా చరణ్ పై వచ్చిన కోపంతో భవిష్యత్ లో సమంత మరింత అందంగా మారబోతోంది అనుకోవాలి..