నిన్న విడుదలైన ‘టెంపర్’ ఇరు రాష్ట్రాలలోను సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో గత మూడు సంవత్సరాలుగా బ్లాక్ బస్టర్ కోసం కలలు కంటున్న జూనియర్ కోరిక తీర్చే సినిమాగా ‘టెంపర్’ మారింది. ఈ సినిమా 100 కోట్ల సినిమాగా మారి టాలీవుడ్ రికార్డులను క్రియేట్ చేస్తుందని జూనియర్ అభిమానులు అప్పుడే లెక్కలు వేసేస్తున్నారు.

అయితే టాలీవుడ్ విశ్లేషకులు మాత్రం ‘టెంపర్’ ఇప్పటి వరకూ విడుదలైన జూనియర్ సినిమాలలో హైయ్యస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా మారడంలో ఎటువంటి సందేహం లేదని అయితే ‘టెంపర్’ కలెక్షన్స్ రేంజ్ ఏ స్థాయికి చేరుకుంటుంది అని చెప్పడానికి మరో 5రోజులు అయితే కాని చెప్పలేము అని అంటున్నారు. ఈ వార్తలు ఇలా ఉండగా ‘పటాస్’ ఆడియో వేడుకలో జూనియర్ అన్నట్లుగా ఈ సంవత్సరం నందమూరి నామ సంవత్సరంగా మారిపోయి ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల ఇద్దరి సినిమాలు సూపర్ హిట్ కావడంతో రాబోతున్న బాలకృష్ణ ‘లయన్’ పై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోoది అనే వార్తలు వినపడుతున్నాయి.

నందమూరి కుటుంబానికి చెందిన రెండు సూపర్ హిట్లు వరసగా వచ్చిన తరువాత వచ్చేనెల చివరిన ‘లయన్’ రాబోతూ ఉండటంతో అభిమానులలో విపరీతమైన అంచనాలు పెరిగి పోతాయని ఆ అంచనాలను అందుకోవడంలో బాలయ్య ‘లయన్’ ఏ మాత్రం వెనకడుగు వేసినా దానికి భారీ మూల్యం చెల్లించుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుందని విశ్లేషకుల వాదన.

అంతేకాదు అబ్బాయిల సినిమా కలెక్షన్స్ స్థాయిని అందుకోకుండా ఒక ఎవరేజ్ హిట్ గా ‘లయన్’ మారితే అది బాలయ్య క్రేజ్ కు ఒక అడ్డు కట్టగా మారుతుందని సరి కొత్త విశ్లేషణలు తెరపైకి తీసుకువస్తున్నారు. ఇలాంటి పరిస్థుతులలో వినపడుతున్న విశ్లేషణలు బాలయ్యకు ఎలా అనిపించినా ‘లయన్’ కు దర్శకత్వం వహిస్తున్న నూతన దర్శకుడు సత్యదేవాకు మాత్రం విపరీతమైన ఒత్తిడిని పెంచుతుంది అన్నమాట నిజం..

మరింత సమాచారం తెలుసుకోండి: