గానగంధ్వరుడుగా పేరు తెచ్చుకున్న గాయకుడు ఘంటసాల. తన గానంతో తెలుగు హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయాడు ఈ గాయకుడు. తన జీవితంలో ఎన్నో గొప్ప అవార్డులను, సన్మానాలను ఘంటసాల అందుకున్నాడు. అయితే, ఒక విషయాన్ని మాత్రం ఘంటసాల చాలా గొప్పగా భావించే వారు. అదేమిటంటే..... ఘంటసాల వేంకటేశ్వరరావు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తులు. అలాంటి వేంకటేశ్వరరావు గారిని తిరుమల తిరుపతి ఆస్థాన గాయకుడిగా ప్రభుత్వం నియమించింది. దీంతో గర్భగుడిలో స్వామి వారిని దర్శించుకుని, గర్భగుడి ఎదురుగా కూర్చుని స్వామి వారిని తదేకంగా చూస్తూ ఘంటసాల కొన్ని పాటలు పాడారు. గతంలో ఆ స్థలంలో ఒక్క తాళ్లపాక అన్నమయ్య మాత్రమే కూర్చుని స్వామి వారిని ఆ విధంగా సేవించాడని, ఘంటసాలను  కూడా అక్కడే కూర్చోబెట్టమని సర్కార్ ఉత్తర్వు అని తరువాత తెలుసుకున్న ఘంటసాల ఎంతగానో మురిసి పోయారు. 1970 నుంచి 1973 వరకూ తిరుమల తిరుపతి ఆస్థాన గాయకుడిగా ఘంటసాల బాధ్యతలు నిర్వహించారు. దేవస్థానం వారిచే బంగారు పతకాన్ని కూడా బహుమతిగా ఆయన అందుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: