తెలుగు ఇండస్ట్రీలో అందగాడిగా పేరు పొందిన హీరో మహేష్ బాబు త్వరలో ప్రేక్షకుల ముందుకు ‘శ్రీమంతుడు’ గా రాబోతున్నాడు. జీవితంలో దేనికి లోటులేని సంపన్న కుటుంబానికి చెందిన యువకుడి కథ ఇది. ఓ లక్ష్యాన్ని నెరవేర్చుకునే సంకల్పంతో అతను ఇండియాకు వస్తాడు. ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటాడు. ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లేమిటి? లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో అతనిలో కలిగిన సంఘర్షణ ఏమిటి? అన్నదే చిత్ర ఇతివృత్తం.

మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పుడు ఈ సినిమాలో ఒక ట్విస్ట్.. ఈ సినిమాలో నయనతార సందడి చేయబోతున్నట్లు కథనాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. విషయానికి వస్తే ...ఇప్పుడు సడన్ గా ఈ సినిమాలో నయనతార ఎలా వచ్చిందని అనుకుంటున్నారా? ఇది వేరే మేటర్లేండి. నయనతార కథానాయికగా నటించిన `మయూరి` ట్రైలర్ ను శ్రీమంతుడు థియేటర్లలో ప్రదర్శించబోతున్నారట.


మాయా చిత్రంలో నయనతార


తమిళంలో నయనతార ప్రధాన పాత్రలో అశ్విన్ శరవణన్ దర్శకుడిగా తమిళంలో `మాయ` అనే చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ అయ్యింది.. దీన్ని తెలుగులో ‘మయూరి’ గా విడుదల చేయబోతున్నారు. పూర్తి హర్రర్, థ్రిల్లర్ ఈ సినిమాలో నయన తార దెయ్యంగా అందరినీ భయపెడుతుందట. తెలుగు వర్షన్ కి సి.కళ్యాణ్ నిర్మాత. త్వరలోనే పాటల్ని విడుదల చేస్తారు. ఆగస్టు రెండో వారంలో కానీ మూడో వారంలో కానీ సినిమాని విడుదల చేస్తారు. మహేష్ తో పాటు ట్రైలర్ వస్తోంది కాబట్టి `మయూరి`కి మంచి పబ్లిసిటీనే దక్కబోతోంది


మరింత సమాచారం తెలుసుకోండి: