ఒక
సినిమా హిట్ అయితే ఎంత క్రేజ్ వస్తుందో అంతకంటే ఎక్కువ క్రేజ్ అతిపెద్ద
రియాలిటీ షో బిగ్ బాస్ విజేతగా గెలిస్తే వస్తుంది. అయితే
బిగ్ బాస్ లోకి వెళ్లాడానికి సోషల్
మీడియా సెలబ్రెటీలు..టీవీ సెలబ్రెటీలు పోటీ పడినా
సినిమా తారలు మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్ చూపరు. ఎందుకంటే వారికి అప్పటికే కొంత ఫేమ్ ఉంటుంది కాబట్టి. అప్పటికే కొంత క్రేజ్ ఉన్నవాళ్ళు వెళ్లి సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతే ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. అందుకే సినిమాల్లో నటించిన వాళ్ళు
బిగ్ బాస్ లో అడుగు పెట్టడానికి ఆలోచిస్తారు. ఒక వేళ రెమ్యునేషన్ టెంప్టింగ్ గా ఉంటే మాత్రం ఒప్పుకుంటారానుకోండి అది వేరే మ్యాటర్. ఇదిలా ఉండగా తాజాగా
ఉదయ్ కిరణ్ పక్కన నువ్వు నేను సినిమాలో నటించిన
హీరోయిన్ అనిత హాసానందాని
బిగ్ బాస్ కు వెళతానని కామెంట్స్ చేసింది. అంతే కాకుండా తన బుజ్జి కొడుకును కూడా తీసుకెళతానని చెప్పింది.
అదేంటి
బిగ్ బాస్ లోకి అడల్ట్స్ కి తప్ప కిడ్స్ కు అవకాశం లేదని అనుకుంటున్నారా.? అవును కిడ్స్ కు
బిగ్ బాస్ లోకి వెళ్లే అవకాశం లేదు. అందుకే
అనిత కూడా సీరియస్ గా చెప్పలేదులెండి ఆమె కూడా జోక్ చేసింది. అసలు మ్యాటర్ ఏంటంటే
బిగ్ బాస్ సీజన్ 13
విజేత సిద్ధార్థ్ శుక్లా కు
అనిత భర్త రోహిత్ రెడ్డి స్నేహితుడు. అయితే సిద్ధార్త్ కండలు చూసి
ఫిదా అయిన
అనిత భర్త సిద్ధార్థ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అది చూసిన నెటిజెన్ లు
సిద్ధార్థ్ ను పొగుడుతూ కామెంట్ల వర్షం కురిపించారు. ఇక
అనిత కూడా ఓ ఫన్నీ కామెంట్ చేసింది. "బోలెడన్ని కామెంట్స్ వస్తున్నాయి. నా కొడుకు ఆర్నావ్ ను తీసుకుని నేను కూడా వచ్చే
బిగ్ బాస్ సీజన్ లో అడుగుపెడతాను" అంటూ
అనిత కామెంట్ పెట్టింది.