రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియాలో అదేవిధంగా సామాజిక సేవలో చాల యాక్టివ్ గా ఉంటుంది. దీనికితోడు ఆమె టాప్ యంగ్ హీరోల భార్యలతో కూడ చాల సన్నిహితంగా ఉంటుంది. మహేష్ భార్య నమ్రత తో ఆమె చాల సన్నిహితంగా ఉంటుంది అన్న విషయం ఓపెన్ సీక్రెట్. అయితే ఈమధ్య కాలంలో ఉపాసన జూనియర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి తో కూడ చాల సన్నిహితంగా ఉంటోంది.


ముఖ్యంగా ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ షూటింగ్ మొదలైన తరువాత చరణ్ జూనియర్ ల మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగి పోవడంతో ఆ సాన్నిహిత్య ప్రభావం వారి భార్యలు ఉపాసన ప్రణతి లపై కూడ పడినట్లు తెలుస్తోంది. ఇప్పుడు వీరిద్దరూ తమ ఫ్యామిలీ వెకేషన్స్ ను కలిసి ప్లాన్ చేసుకోవడమే కాకుండా ఈ ఇద్దరూ తమ కుటుంబ ఈవెంట్లలో రెగ్యులర్ గా కలుస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.


ఇప్పుడు ఈ వార్తలు చరణ్ జూనియర్ అభిమానుల మధ్య వైరల్ కావడంతో వీరిద్దరూ వేర్వేరు సందర్భాల్లో ఔటింగ్ కి వెళ్లిన ఫోటోలను జత చేసి చరణ్ జూనియర్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు వీరిద్దరూ అవకాశం చిక్కినప్పుడల్లా  జూబ్లీ హిల్స్ కేబీ ఆర్ పార్క్ పరిసరాల్లోని కాఫీ కేఫ్ లకు వెళ్ళి వస్తున్నారని టాక్.


ఇక ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ తరహాలో మెడలో హ్యాండ్ బ్యాగ్ ని ధరించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది హాఫ్ వైట్ అనే విదేశీ బ్రాండ్ లెదర్ బ్యాగ్. దీని ధర $1200 నుంచి $1600 డాలర్లు ఉంటుంది అంటే మన ఇండియన్ కరెన్సీ లో సుమారు  లక్ష రూపాయల పైనే ఉంటుందని అంచనా కట్టారు. ఇప్పటి వరకు ఉపాసన స్టైలిష్ గా ఉన్న ఫోటోలు చాలావరకు మీడియాలో కనిపిస్తాయి కానీ జూనియర్ వైఫ్ కు సంబంధించిన ఫోటోలు పెద్దగా కనిపించవు. అయితే ఇప్పుడు ఉపాసన తో సమానంగా జూనియర్ భార్య కూడ స్టైల్ గా కనిపిస్తున్న పరిస్థితులలో తారక్ అభిమానులు మంచి జోష్ లో ఉన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: