విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.. ఇక ఈ సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు విజయ్.. ఇక ఇతనితో పాటు సినిమాలో అతడి ఫ్రెండ్ గా నటించిన రాహుల్ రామకృష్ణ కి కూడా మంచి గుర్తింపు లభించింది.. అక్కడితో కమెడియన్ గా పలు సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ తాజాగా డైరెక్టర్ అనుదీప్ తెరకెక్కించిన  "జాతిరత్నాలు" సినిమాతో ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు.ప్రస్తుతం జాతిరత్నాలు సినిమాకు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి..

నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి,రాహుల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మ రథం పడుతున్నారు..ఇక ఇదిలా ఉంటె జాతిరత్నాలు మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రాహుల్ రామకృష్ణ మీడియాతో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు.ఈ మూవీలో రవి పాత్రలో నటించగా, తన పాత్రకు ఆడియన్స్ నుంచి అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ వస్తోందని రాహుల్ రామకృష్ణ చెప్పుకొచ్చాడు. ఈ మూవీ కథ వింటున్న సమయంలోనే తనకు నవ్వు ఆగలేదని కథను బాగా ఎంజాయ్ చేశానని అయితే, ఆడియన్స్ రిసీవ్ ఎలా ఉంటోండోనన్న భయం ఉండేదని చెప్పాడు.కానీ తన పాత్రకు ఆడియన్స్ నుంచి స్పందన చూసాక సినిమా విషయంలో తనకు ఉన్న అనుమానాలన్నీ పోయాయని రాహుల్ రామకృష్ణ చెప్పుకొచ్చాడు.

జాతిరత్నాలు సినిమాకు హాస్యమే బలమని రాహుల్ రామకృష్ణ చెబుతూ, నిజానికి పాత్రల మధ్య కథ పెద్దగా లేకున్నా, హాస్యం ప్రధానంగా ఈ సినిమా తెరకెక్కిందని స్పందించాడు. తనకు ప్రియదర్శితో గత 12 సంవత్సరాల నుంచి పరిచయం ఉందని జాతిరత్నాలు సినిమాతోనే నవీన్ పోలిశెట్టితో పరిచయం ఏర్పడిందన్నాడు. కాగా సినిమాల్లోకి రాకముందు జర్నలిస్ట్ గా పని చేశానని, సినిమా రిపోర్టర్ అవ్వాలని భావించి ఇండస్ట్రీకి వచ్చి, చివరకు సినిమాలలో హాస్య భరిత పాత్రలలో చేస్తున్నానని చెప్పాడు.. ఇక ప్రస్తుతం రాజమౌళి రూపొందిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ rrr లో కూడా ఓ కీలక పాత్రలో రాహుల్ రామకృష్ణ నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: