తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో రానా గురించి తెలియని వారంటూ ఉండరు. తనదైన శైలితో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు. తాజగా రానా, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్న సినిమా విరాట పర్వం. నీది నాది ఒకే కథ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వేణు రెండో సినిమాకు నక్సలిజం బ్యాక్ డ్రాప్ ఎన్నుకున్నాడు.

అయితే ఈ సినిమాకు టీజర్, పోస్టర్స్ అన్ని ఇది పూర్తిగా నక్సలైట్ బ్యాక్ డ్రాప్ కదా అని ఫిక్స్ అయిపోయారు. కానీ ఇందులో ఒక అద్భుతమైన ప్రేమకథ ఉంది. నిజానికి విరాట పర్వం ఒక అందమైన ప్రేమకథ. రానా, సాయి పల్లవి మధ్య జరిగే లవ్ స్టోరీ చాలా అద్భుతంగా ఉంటుంది అంటున్నాడు దర్శకుడు వేణు. తాజాగా ఈ చిత్రం టీజర్ విడుదలైంది.



ఇక ఇందులో కూడా ఎక్కువ భాగం నక్సలిజం చూపించాడు దర్శకుడు. అందులోనే సాయి పల్లవి ప్రేమను కూడా హైలైట్ చేశాడు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ టీజర్‌లో ఈ విషయం ఎంతమంది గమనించారో తెలియదు కానీ.. అది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. విరాట పర్వంలో రానా దగ్గుబాటి పెన్ నేమ్ అరణ్య. ఈ పేరు వింటే మనకు ఏం గుర్తొస్తుంది తెలుసు కదా.. ఇదే పేరుతో ఇప్పుడు రానా దగ్గుబాటి ఒక సినిమా చేస్తున్నాడు. అంటే ఒకే పేరుతో రెండు సినిమాల్లో కనిపిస్తున్నాడు రానా. ఇది నిజంగానే ఆసక్తికరంగా అనిపిస్తుంది.

అయితే విరాట పర్వంలో రవన్న పాత్రలో నటిస్తున్నాడు రానా. సినిమాలో ఈయనను చూడకుండానే అతడు రాసిన కవితలతో ప్రేమలో పడిపోతుంది సాయి పల్లవి. అలా అరణ్యను వెతుక్కుంటూ అరణ్యంలోకి వెళ్లిపోతుంది. అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. ఏప్రిల్ 30న విరాటపర్వం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అలాగే మార్చి 26న అరణ్య విడుదల కానుంది. ఏదేమైనా అరణ్య విరాట పర్వంలో కూడా ఉన్నాడన్న మాట

మరింత సమాచారం తెలుసుకోండి: