
విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమా తో ప్రియదర్శి టాలీవుడ్ కి వచ్చి తక్కువ కాలంలోనే స్టార్ కమెడియన్ అయిపోయాడు.. ప్రస్తుతం అయన చేతిలో పెద్ద పెద్ద సినిమాలే ఉన్నాయి.. ఇక విజయ్ దేవరకొండ మరో సినిమా అర్జున్ రెడ్డి తో పరిచయమైన స్టార్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ.. ఒక్క సినిమా తోనే స్టార్ గా ఎదిగాడు రాహుల్.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఏ సినిమాలో చూసినా ఈ ఇద్దరు కమెడియన్స్ హవానే ఎక్కువగా ఉంది.. ఒకరికొకరు పోటీ పడుతూ వరుస సినిమాల్లో చేసుకుంటూ పోతున్నారు..
అయితే ఇప్పుడు అందరి చర్చ రాహుల్ రామకృష్ణ గెటప్ గురించే.. రాహుల్ గత రెండు సంవత్సరాలుగా గడ్డం, జుట్టుతో ఉన్నాడు. జాతి రత్నాలు సినిమాలో కూడా అలానే కనిపించాడు. అయితే ఏదో కొన్ని నెలలు అంటే ఏదో సినిమా కోసం అనుకోవచ్చు కానీ.. రాహుల్ మాత్రం రెండేళ్లుగా అలానే ఉన్నాడు. దీంతో రాహుల్ ఎందుకు అలా ఉండిపోయాడు అన్న అనుమానం చాలా మందిలో ఉంది. అయితే రాహుల్ గడ్డం, జుట్టు పెంచడం వెనుక కారణం ఏంటంటే ఆర్ఆర్ఆర్.ఇందులో ఓ కీలక పాత్రలో రాహుల్ నటిస్తున్నాడు. ఎన్టీఆర్ అనుచరుడిగా ఇతడు కనిపించనున్నాడట. ఇక ఈ పాత్ర సినిమాలో చాలా సేపు ఉండనుందట. ఈ క్రమంలోనే రాహుల్ గడ్డం, జుట్టును పెంచాడు. ఈ సినిమాకు ఒప్పుకున్నప్పుడే గడ్డం, జుట్టును తీయనని రాహుల్‌తో రాజమౌళి అగ్రిమెంట్ తీసుకున్నారట. ఈ క్రమంలో అలానే పెంచాడట.